అంత బిల్డప్ వద్దు ఆ హీరో పై సిద్ధుకి సెన్సషనల్ కామెంట్స్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఈ పాన్ ఇండియా అనే పదం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏ హీరో నైన ఇప్పుడు తన సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలనే చూస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా పదం పై పెద్ద వార్ నే జరుగుతుంది. ఈ క్రమంలోనే హీరో సిద్ధార్ధ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. అంతేకాదు సిద్ధు మాటల బట్టి చూస్తుంటే ఓ స్టార్ హీరోనే టార్గెట్ చేసి మాట్లాడారు అంటున్నారు సినీ ప్రముఖులు. పైగా ఆ హీరో తో సిద్ధుకి పాత్ర శత్రుత్వం కూడా ఉండటంతో వ్యవహారం మరింత హీట్ పెంచుతుంది.

పాన్ ఇండియా సినిమాలు అంటూ వచ్చిన పుష్ప, RRR, KGF 2 సినిమాలు ఈ మధ్య బాక్స్ ఆఫిస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. అంతేకాదు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. దీంతో మిగతా డైరెక్టర్లు, హీరోలు కూడా పాన్ ఇండియా అంటూ డప్పు కొట్టుకుంటున్నారు. ఇక పాన్‌ ఇండియా పదంతో అటు నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ హీరోలకు మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సిద్ధార్ధ్ ..ఈ వ్యవహారం పై రెస్పాండ్ అయ్యారు. తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతూ..అస్సలు ఆ పదం పెద్ద నాన్సెన్స్‌ అంటూ కొట్టిపడేశారు. ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్‌ ఇండియా అని ఎందుకంటున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు.

“పాన్‌ ఇండియా అన్నది అగౌరవకరమైనది.. అదో నాన్సెన్స్‌. మనం చేసేవి అన్ని భారతీయ చిత్రాలే. అయితే మరీ ప్రత్యేకించి ఎందుకు కొన్ని వాటికే పాన్ ఇండియా అంటున్నారు. అలా అయితే 15ఏళ్ల క్రితమే “రోజా” లాంటి బ్లాక్ బస్టర్ పాన్‌ ఇండియా సినిమా ని డైరెక్ట చేశారు మణిరత్నం. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమాను నచ్చిన భాషలో చూసే హక్కు ప్రతి ప్రేక్షకుడికి ఉంది. అందుకే పాన్‌ ఇండియా అన్న పదం తీసేసి ఇండియన్‌ సినిమా అని పేరు పెట్టాలి. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆదరిస్తారు జనాలు..అంతే కానీ..కంటెంట్ లేని సినిమాలు కూడా పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ ఘాటుగా స్పందించాడు. దీంతో సిద్దార్థ్‌ మాటలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. సిద్ధూ ఆ సో కాల్డ్ పాన్ ఇండియా హీరోనే టార్గెట్ చేసి అంటున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. మరి చూడాలి, ఆ హీరో సిద్ధుకి ఎలాంటి కౌంటర్ ఇస్తాడో..?

Share post:

Popular