ఎన్టీఆర్ v/s రామ్ చరణ్ ఆస్తులు మరియు రెమ్యూనరేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు !

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ దక్కిందో మనము చూశాము. అంతే కాకుండా ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సినిమాకి కలిసి పని చేయడం వలన వీరిద్దరి మధ్యన స్నేహం మరింత పెరిగింది. ఇందులో వీరి నటనకు ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే 1100 కోటు సాధించి రికార్డులు తన పేరిట రాసుకుంది. ఈ సినిమా కారణంగా సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అందులో తీసుకునే వీరి పర్సనల్ లైఫ్, ప్రాపర్టీస్, కార్స్ మరియు డబ్బు మిగిలిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. అందుకే ఇప్పుడు వీరిద్దరి లైఫ్ గురించి కీలకం అయిన కొన్ని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1)ఖరీదైన కార్లు : ఒక స్టార్ హీరో రేంజ్ లో ఉన్న వారికి ఖరీదైన కార్లు ఉండడం ఆశ్చర్య పడే విషయం ఏమీ కాదు. అంతే కాకుండా కొత్త కార్లు ఏవి వచ్చినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయిథేబె అందరికన్నా ముందే మార్కెట్ లో విడుదల అయిన కార్లను కొనడానికి ఇష్టపడుతారు. ఇప్పటికే యంగ్ టైగర్ లంబోర్గిని యూరుస్ గ్రాఫైట్ కార్ తన గ్యారేజీ లో ఉంచారు. దేశంలోనే ఈ కారును కొన్న మొదటి వ్యక్తి ఎన్టీఆర్ కావడం విశేషం. ఈ కార్ విలువ 3.16కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ గారేజ్ లో రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, జిఎల్ఎఫ్ 350డి, అలాగే పోర్షే 718 కేమ్యాన్ లు ఉన్నాయి. అయితే ఇన్ని కార్లు ఉన్నా బీఎండబ్ల్యూ ఎల్ డి కారునే ఎన్టీఆర్ వాడుతాడట. దీని విలువ 1.32 కోట్ల రూపాయలు ఉండొచ్చని తెలుస్తోంది.

3)రామ్ చరణ్ : ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే… ఇతని దగ్గర హీరో ఆస్టన్ మార్టిన్ వన్ టేజ్ కారు ఉంది. ఈ కారును రామ్ చరణ్ కు తన తండ్రి చిరంజీవి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా రామ్ చరణ్ దగ్గర మెర్సిడెస్ బెంజ్, జి ఎల్ ఎస్ 350 డి లాంటి కార్లు ఉన్నాయి. వీటి ధర 80 లక్షల రూపాయలు ఉండొచ్చు. ఇక ప్రత్యేకం ఏమిటంటే 3.34 కోట్ల రూపాయల విలువ గల రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్ కూడా రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఇది తనకు ఇష్టమయిన కారు అని కూడా తెలుస్తోంది.

4). ఇక ఎన్టీఆర్ కి 80 కోట్లు విలువ చేసే ప్రైవేట్ జెట్ ఉందట.. ఈ జెట్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ చేసి ఉంచుతారట.

5). అలాగే రామ్ చరణ్ కి అయితే ట్రూ జెట్ అనే సొంత ఎయిర్ లైన్ సంస్థ ఉంది.

6). ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు పక్క పక్కనే నివసిస్తూ ఉంటారు. వీరికి హైద్రాబాద్ లో ఖరీదైన మరియు విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

7). జూబిలీ హిల్స్ లో ఎన్టీఆర్ కి అత్యంత ఖరీదైన బంగ్లా ఉంది. ఇది కాకుండా హైదరాబాద్ మరియు బెంగుళూరు లలో వివిధ చోట్ల కొన్ని బంగ్లాలు ఉన్నాయి.

8) ఇక రామ్ చరణ్ ఈ మధ్యనే హైదరాబాద్ లో దాదాపు 30 కోట్లు ఖర్చు చేసి ఒక ఖరీదైన ప్లాట్ ను కొనుగోలు చేసాడని తెలుస్తోంది.

9). ఎన్టీఆర్ కి ఇప్పటి వరకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ 440 కోట్లు ఉంటుందని మీడియా నుండి అందుతున్న సమాచారం.

10). ఇక రామ్ చరణ్ ఆస్తుల విలువ చూస్తే 1300 కోట్లు ఉంటుందట. నిజంగా ఇది మెగా ఫ్యాన్స్ ఆనందపడే వార్త నాయి చెప్పాలి.

11). ఎన్టీఆర్ తన డిగ్రీని గుంటూరు లోనే విజ్ఞాన్ కాలేజ్ లో పూర్తి చేశారు. రామ్ చరణ్ మాత్రం హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ నుండి బీకామ్ చేశారు.

12). ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు కెరీర్ పరంగా ఉన్న కామన్ పాయింట్ చూస్తే… రాజమౌళి వీరిద్దరికీ మంచి ఇండస్ట్రీ హిట్ లను అందించాడు. ఎన్టీఆర్ కు యమదొంగ, రామ్ చరణ్ కు మగధీర..

13). వీరిద్దరికీ కూడా ఇంపోర్టెడ్ బైక్స్ అంటే ప్రాణం అని తెలుస్తోంది. కానీ కొన్ని కారణాల వలన వీటిని ఉపయోగించలేకపోతున్నారు అని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ కు అయితే రెండు గుర్రాలు ఉన్నాయట. ఇద్దరూ కూడా ఒక్కో సినిమాకు సమానంగానే పారితోషికం తీసుకుంటున్నారట… అయితే ఎన్టీఆర్ మాత్రం యాడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటున్నాడు.

Share post:

Popular