ఇండస్ట్రీకి ఒక్క మగాడు ఆయనే..అంతేగా అంతేగా..!!

సినిమా అనగానే అందరికి గుర్తు వచ్చేది హీరో, హీరోయిన్లు. ఆ తరువాతనే డైరెక్టర్ , నిర్మాతలు గుర్తు వస్తారు. తర తరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తుంది. కానీ, నేటి కాలం లో హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా డైరెక్టర్స్ కూడా సత్తా చాటుతున్నారు . డ్యాన్స్లు ఇరగదీస్తున్నారు. నటన పరంగా ఇక చెప్పన్నవసరం లేదు. కుమ్మేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో హీరోలకన్నా కూడా డైరెక్టర్ల్ కే డిమాండ్ బాగా ఉండేటట్లు ఉంది అనిపిస్తుంది.

రీసెంట్ గా అనిల్ రావిపూడి ని చూసి జనాలు …ఇండస్ట్రీకి ఒక్క మాగాడు అంటూ ట్యాగ్ ఇచ్చేశారు. అందుకు రీజన్స్ కూడా ఉన్నాయి. త్వరలోనే ఆయన తెరకెక్కించిన F3 సినిమా రిలీజ్ అవుతుంది. మే 27 న గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ అయితే ఓ రేంజ్ లో చేస్తున్నారు అనిల్. కానీ, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే..హీరో, హీరోయిన్లు లేకుండానే సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు.

బుల్లి తెర పై ఆ ఛానెల్..ఈ ఛానెల్ అని కాకుండా ఉన్న ఛానల్స్ అన్నింటిలోని ప్రోగ్రామ్‌స్ కి అటెండ్ అవుతూ..సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చారు. అంతేకాదు ఆయన కామెడీ టైమింగ్ కి..డ్యాన్స్ కి, ఆ ఎనర్జీకి ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. అస్సలు F3 సినిమా ప్రమోషన్స్ లో వెంకీ,వరుణ్ , తమ్మన్నా, మెహ్రీన్ లను ఎవ్వరు పట్టించుకోవడం లేదంటే..అనీల్ ఎంత బాగా జనాలకు దగ్గరయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. ఓ డైరెక్టర్ ఇలా సింగిల్ గా ప్రమోషన్స్ చేయడం ఇదే తొలిసారి. రాజమౌళి సైతం..తమ హీరోలను వేసుకుని తిరిగారు. కానీ, అనీల్ సింగిల్ గా సింహం లాగా..ఒక్కడే ప్రమోషన్స్ లో పాల్గొని అభిమానులను మెప్పించడం చూసి జనాలు ఒక్క మగాడు అంటూ ట్యాగ్ ఇచ్చేశారు. ఇక సినిమా అయితే బ్లాక్ బస్టర్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు జనాలు. మరి చూడాలి..అనిల్ ఎలా నవ్విస్తాడో..?

Share post:

Popular