ప్రియుడు కోసం నయన్ ఎంతటి త్యాగం చేసిందో తెలుసా..?

లేడి ఆటో బాంబ్ నయన తార అంటే చాలా మందికి ఇష్టం. స్టార్ హీరో తో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరోయిన్. చీర కట్టిన, బికినీ వేసుకున్నా..కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే అందం తో కుర్రాళ్ల మనసు దోచిన ఈ అమ్మడు..అటు కోలీవుడ్ ఇటు టాలివుడ్ లోను సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. సినిమా ల పరంగా అమ్మడు ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. తన క్యారెక్టర్స్ చూసింగ్ విషయాలల్లో నయన పక్క గా ప్లాన్ చేసుకుంటుంది.

అయితే, గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ తో ప్రేమాయాణం నడుపుతున్న ఈ బ్యూటీ..పెళ్లి కాకుండా అతగాడి ని వెంట పెట్టుకుని గుడి కి, పార్క్ లకు , షాపింగ్ లకు వెళ్తూ..భార్య లానే బీహేవ్ చేస్తుంది, కోలీవుడ్ ప్రజలు కూడా వీళ్లు మరీ ఓవర్ చేస్తున్నారు..పెళ్లికి ముందే ఇంత క్లోజ్ గా మూవ్ అవ్వడం కరెక్ట్ నేనా..అంటూ గుసగుసలాడుకుంటున్నా..ఆ విషయాలను వాళ్ల చెవుల వరకు వెళ్తున్న నయన్-విగ్నేశ్ పెద్ద గా పట్టించుకోవడం లేదు.

అయితే, మరి కొన్ని రోజుల్లో వీళ్ల పెళ్ళి తిరుపతిలో ఘనం గా చేసుకోవడానికి పక్క ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై అధికారిక ప్రకటన కూడా రేపో మాపో అన్నట్లు తెలుస్తుంది. ఇక ఇలాంటీ టైం లో నయన్ చేసిన పనికి కోలీవుడ్ నే కాదు యావట్ సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. మనకు తెలిసిందే 75వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భారతదేశం ‘కంట్రీ ఆఫ్‌ హానర్‌’గా నిలిచింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. కాన్స్‌ వేదిక సాక్షిగా భారతదేశంలో చిత్రీకరించే విదేశీ చిత్రాలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు అనురాగ్‌ ఠాకూర్‌. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ , కోళీవుడ్, బాలీవుడ్ నుండి ప్రముఖ హీరోయిన్స్ హాజరైయారు. నిజానికి ఈ వేడుకకు నయన్ కి కూడా ఆహ్వానం అందింది. కానీ, పెళ్లి పనులు అన్నీ ప్రియుడు పై వేసి తాను వెళ్లను అని మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇలాంటి అవకాశం అందరికి రాదు. కానీ, విగ్నేశ్ కోసం నయన్ చేసిన త్యాగం మరువలేనిది అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు.