అటు ఇటు తిరిగి మళ్లీ అదే టైటిల్..”జై బాలయ్య” అనాల్సిందే..?

ఇప్పుడు వస్తున్న సినిమాల టైటిల్ చూస్తే..సినిమా కధలోని మ్యాటర్ కి …ఆ టైటిల్ కి ఏం సంబంధం ఉండదు. కొన్ని సినిమాలకు అయితే అర్ధంకాని టైటిల్ పెడుతుంటారు. మరి కొన్ని సినిమాలకి సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి పెట్టెసి క్రింద మరో క్యాప్షెన్ కూడా ఇస్తారు. అలా కొందరు డైరెక్టర్స్ సినిమాలకు అడ్డ దిడ్డ మైన పేర్లు పెడుతుంటారు. కానీ, బాలయ్య కు అలాంటివి నచ్చదు. ఆయన కు ఏదైన పద్ధతిగా ఉండాలి.

ఆయన సినిమాలో కూడా అన్ని విషయాలు అలానే ఉండేలా చూసుకుంటారు. సినిమాకి కమిట్ అయ్యాం ..మన పని మనం చేసుకుని డబ్బులు తీసుకున్నామా అని సైలెంట్ గా ఉండలేరు. సినిమాకి సంబంధించిన ప్రతి అంశాని క్షుణంగా పరిశీలిస్తారు. ఏ హీరోయిన్ ని పెడితే బాగుంటుంది.. ఏ పాత్రకు ఎవరు అయితే సెట్ అవుతారు..ఆడవాళ్ళు మరీ టూ ఎక్స్ పోజింగ్ ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే NTR 107 విషయంలో ను బాలయ్య ప్రతి విషయాని బాగా పరిశీలించి ఓకే చేస్తున్నాడట.

నిజానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఇద్దరు స్టార్ హీరోయిన్లు పేర్లను చెప్పినప్పుడు బాలయ్య శృతి హాసన్ ని సెలక్ట్ చేసుకున్నారట. ఎందుకంటే ఆ పాత్రకి ఆమె ఐతే ఎక్స్ ప్రెషన్స్ పలికించగలదు…లుక్స్ పరంగా కూడా సెట్ అవుతుంది అని చెప్పుకొచ్చారట. ఇక ఈ సినిమా టైటిల్ విషయమై గత కొన్ని నెలలుగా చర్చలు నడుస్తున్న మేకర్స్ తికమక పడుతూ..కన్ఫ్యూజ్ అవుతున్నారట . ఈ క్రమంలోనే సీన్ లోకి బాలయ్య ఎంటర్ అయ్యి..ఆయన పేరు కలిసి వచ్చేలా..”జై బాలయ్య ” అనే టైటిల్ నే ఫిక్స్ చేయమన్నారట. అఖండ సినిమాలో “యా యా యా యా జై బాలయ్య” పాట ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమా పేరు కూడా అదే పెడితే..ఖచ్చితంగా సినిమా కి మరింత బజ్ ఏర్పడుతుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Share post:

Latest