దొంగసచ్చినోళ్లు ..అనిల్‌, సునీల్‌.. పరువు పాయే..!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనీల్ రావిపూడిని..స్టార్ కమెడీయన్ సునీల్ ని ఒక్క అమ్మాయి..దొంగసచ్చినోళ్లు అంటూ అందరిముందే తిట్టేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా షాక్ అయినా..ఆమె పరిస్ధితి అర్ధం చేసుకుని..కూల్ అయ్యి..ఆ మాటలను సరదాగా తీసుకున్నారు. ఇదంతా జరిగింది బిగ్ బాస్ హౌస్ లో. అనిల్, సునిల్ ని తిట్టింది బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ. అసలు ఏమైందంటే …

బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ నుంచి అనిల్‌, బాబా భాస్కర్‌, మిత్రా శర్మ తక్కువ ఓట్లు రావడం వల్ల ఎలిమినేట్ అయ్యి..బయటకు వచ్చేశారు. ఇక అప్పుడు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి, కామెడియన్ సునీల్. F3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. ఈ క్రమంలోనే డబ్బుల ఎపిసోడ్‌ భళే రసవత్తరంగా మారింది. ఇక సూట్ కేస్ పట్టుకుని లోపలికి వెళ్లిన అనిల్,సునీల్..అందరిని బిగ్ ఆఫర్ తో టెంప్ట్ చేయాలని చూశాడు. కానీ ఎవ్వరు లొంగలేదు, ఫైనల్ గా టై అయిపోతుంది అనగానే టక్కున అరియాన తీసేసుకుని..ఆఫర్ ను లాక్ చేసింది.

అయితే, హౌస్ నుండి బయటకు వచ్చక..సూట్‌కేస్‌తో స్టేజ్‌పైకి వచ్చిన అరియానాతో హోస్ట్ నాగార్జున ఓ ఆట ఆడుకున్నారు. అందులో డబ్బు ఉందంటే ఎలా నమ్మావ్‌ అని సరదాగా జోక్ చేసారు. దీంతో అరియానా కోపంతో అనిల్‌, సునీల్‌ వైపు చూస్తూ..”వామ్మో.. ఈ దొంగసచ్చినోళ్లను నమ్మి వచ్చేశానే” అంటూ అరియానా తిట్టేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరపూసాయి. ఇక ఫైనల్ గా ఆ బాక్స్ లో 10 లక్షలు ఉన్నాయంటూ అరియానని కూల్ చేశాడు నాగార్జున. ఇక ఫైనల్ గా అఖిల్ రన్నర్ గా..ఆడపులి బిందు మాధవి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు.

Share post:

Latest