స్టార్ డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ చేసిన తమన్నా..మ్యాటర్ సీరియస్సే..?

మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి. ఆ లేలేత తెల్లటి అందాలను కుర్రాళ్లు కళ్ళతోనే అస్వాధిస్తారు, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉందో..ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికి అంతే అందంగా నాజుకుగా..జీరో సైజ్ మెయిన్ టైన్ చేస్తూ..ఫిగర్ ని కాపాడుకుంటూ..తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ వస్తుంది తమన్నా.

కోలీవుడ్ లో టైం బ్యాడ్ అయినా..తెలుగులో, బాలీవుడ్ లో సినిమా చేస్తూ బిజీ గానే ఉంది. తాజా గా ఆమె హీరోయిన్ గా నటించిన F3 సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మే 27 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు అంత సిద్ధమైపోయింది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా..ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసి ..సక్సెస్ ఫుల్ గా జరిపించారు మేకర్స్. కానీ, ఇక్కడే వచ్చింది అసలు ట్వీస్ట్ .

సినిమా ఈవెంట్ లో అందరు బాగానే ఎంజాయ్ చేసినా..హంగామా చేసిన మెయిన్ హీరోయిన్ తమన్నా మాత్రం కనిపించలేదు. అస్సలు ఆమె పేరు ఊసే లేదు. దీంతో ఏమైంది అని ఆరా తీయ్యగా..షాకింగ్ మ్యాటర్ లీకైంది. ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లిన కారణంగా నే రాలేకపోయారు అంటూ టీం సభ్యులు చెప్పుతున్నా.. మ్యాటర్ మరో లా ఉంది. సినిమాలో హీరోయిన్లు గా తమన్నా, మెహ్రీన్ లనే తీసుకున్న అనీల్ రావిపూడీ..సినిమా మధ్యలో తమన్నా పాత్ర తగ్గించి..సోనాలీ చౌహాన్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి,,కధలో చూయించారట. దీంతో హర్ట్ అయిన తమన్నా..ఆయన తో మాట్లాడి చూసిన ఫలితం లేకపోవడంతో ..లాస్ట్ డేస్ షూటింగ్ నుండే మూడీగా ఉన్నిందట. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనమని డైరెక్టర్ కాల్ చేస్తున్న వినిపించుకోకుండా నెంబర్ బ్లాక్ చేసి..రివేంజ్ తీర్చుకుంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మరి దీని పై అనీల్ ఎలా స్పందిస్తారో చూడాలి ..?

Share post:

Latest