మెగాస్టార్ డిజాస్టార్ ‘ ఆచార్య ‘ క్లోజింగ్ క‌లెక్ష‌న్లు ఇవే… దారుణ అవ‌మానం అంటే ఇదే…!

టాలీవుడ్ తండ్రి కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన సినిమా ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్‌తో స్టార్ట్ అయ్యింది. చాలా దారుణంగా ఫ‌స్ట్ వీక్‌కే ఈ సినిమా ఫైన‌ల్ బాక్సాఫీస్ ర‌న్ పూర్తి చేసుకుంది. అస‌లు మెగాస్టార్ కెరీర్‌లో ఇంత దారుణ అవ‌మానం ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు.

ఇన్ని భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా ఈ రేంజ్‌లో డిజాస్ట‌ర్ అవుతుందని ఎవ్వ‌రూ ఊహించ‌నే లేదు. ప్ర‌స్తుతం కొన్ని థియేట‌ర్ల‌లో న‌డుస్తున్నా అది కేవ‌లం అగ్రిమెంట్ బేస్ మీద‌నే న‌డుపుతున్నారే త‌ప్పా షేర్ లేదు. ఓవ‌రాల్‌గా చూస్తే ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 50 కోట్ల షేర్ కూడా రాలేదు.ఆచార్య‌ను ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల రూపాయలకు అమ్మారు.

ఫైనల్ రన్ లో ఈ సినిమాకు కేవలం 50 కోట్ల లోపే వసూళ్లు వచ్చాయి. అంటే 84 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా ఆచార్య నిలిచిపోయింది. నైజాంలో ఈ సినిమాను రు. 42 కోట్ల‌కు అమ్మితే కేవ‌లం 12 కోట్లే వ‌చ్చింది. ఓవ‌ర్సీస్‌లో అయితే మిలియ‌న్ డాల‌ర్లు కూడా రాలేదు.

Share post:

Popular