వైసీపీ ప్రాబ్ల‌మే టీడీపీకి కూడా వ‌చ్చేసిందా…!

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ఇటు అధికార పార్టీ వైసీపీ.. అటు ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ప్ర‌స్తుతం జిల్లాలు, గ్రామాలు, ఇళ్ల ప‌ర్య‌ట‌న‌ల‌కు రెండు పార్టీలూ శ్రీకారం చుట్టాయి. అయితే.. అధిష్టానాల ఆరాటం బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇటు వైసీపీని తీసుకుంటే.. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యింది. అయితే.. ఈ మూడేళ్ల కాలంలో చాలా త‌క్కువ మంది ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్నారు.

దీంతో అధిష్టానం ప్ర‌జల మ‌ధ్య లేని ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యించుకుంది. ఇదే విష‌యా న్ని ఇటీవ‌ల స‌ర్వే చేసిన పీకే టీం కూడా స్ప‌ష్టం చేసింది. దాదాపు 75 మంది ఎమ్మెల్యేలు.. అంటే.. స‌గం మంది.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. ప్ర‌జ‌ల‌కు వారు మొహం చూపించి కూడా మూడేళ్లు అయిపోయింద‌ని.. స్ప‌ష్టం చేసింది. దీంతో వీరి స్థానంలో కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే మంచిద‌న్న‌ట్టుగా పీకే టీం చెప్పేసింది. అయితే. ఇది అంత ఈజీకాద‌నేది సీనియ‌ర్ల మాట‌. పాతవారిని త‌ప్పిస్తే.. క‌ష్టాలు వ‌స్తాయ‌ని అంటున్నారు. అలాగ‌ని కొత్త‌వారిని కూడా కాద‌న‌లేని ప‌రిస్థితి ఉంది.

ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా సేమ్ స‌మ‌స్య ఉంది. పాత‌వారు మూడు సంవ‌త్స‌రాలు ముగి సినా.. ప్ర‌జ‌ల్లోకి రావ‌డం లేదు. వ‌స్తే.. త‌మ‌పై కేసులు పెడుతున్నార‌ని.. త‌మ వ్యాపారాల‌ను దెబ్బ‌తీసే చ ర్య‌లు చేప‌డుతున్నార‌ని.. చెబుతూ.. ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. లేక‌పోతే.. హైద‌రాబాద్‌, బెంగ‌ళూ రు, చెన్నైల‌లోనే వ్యాపారాలుచేసుకుంటున్నారు. దీంతో పార్టీ పుంజుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కావాలంటే.. ప్ర‌జ‌ల్లో ఉండాల్సిందేన‌ని.. చంద్ర‌బాబు చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మాట‌లు ఎవ‌రూ వినిపించుకోవ‌డం లేదు.

ఇక‌, చివ‌రి అస్త్రంగా ఆయ‌నే జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. కానీ, ఎన్నాళ్ల‌ని.. ఇలా చేస్తారు? అనేది సీనియ‌ర్ల మాట‌. కాబ‌ట్టి కొత్త వారికి ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించేయాల‌ని అంటున్నారు. కానీ.వ‌చ్చే ఎన్నిక‌లు చూసుకుంటే.. అత్యంత కీల‌కం. మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. టీడీపీ మ‌రింత క‌ష్టాల్లో కూరుకుపోతుంద‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యువ‌త‌కు టికెట్లు ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించినా.. పాత‌వారిని వ‌దులుకునేందుకు సిద్ధంగా లేరు. ఎలా చూసిన‌.ప్ప‌టికీ.. అటు వైసీపీకి, ఇటు టీడీపీకి మాత్రం సెగ‌లు త‌ప్ప‌వ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.