ఎంద‌రు ఎర్త్ పెడుతున్నా ఆ లేడీ ఎమ్మెల్యేకే మ‌ళ్లీ సీటు… అస‌లు కిటుకు ఇదే…!

రాజ‌కీయాల్లో ఎవ‌రైనా.. త‌మ‌కు ల‌బ్ధి చేకూరుతుందంటే.. ఒక విధంగా.. లేదంటే మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రించ డం.. మామూలే. రాజ‌కీయాల ద‌గ్గ‌ర త‌మ్ముడు త‌మ్ముడే.. అనే టైపునాయ‌కులు చాలా మంది ఉన్నారు. త మ‌కు సొంత ప్ర‌యోజ‌నాలే ముఖ్యం. త‌ర్వ‌తే ఏవైనా.. ఇప్పుడు అదే విష‌యం వైసీపీలోనూ చ‌ర్చ‌గా మారిం ది. గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ వ‌ర్గ విభేదాలు తార‌స్థాయికి చేరాయి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి వ్య‌తిరేకంగా గ్రూపులు త‌యార‌య్యాయి.

ఆమెను బ‌ద్నాం చేస్తూ.. ఇటీవ‌ల ఈ రెండు వ‌ర్గాలు కూడా అర్ధ‌రాత్రి రోడ్డున ప‌డి కొట్టుకున్నాయి. అంతేకా దు.. పోలీసుల‌కు ప‌ర‌స్ప‌రం ఫిర్యాదులుచేసుకున్నాయి. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గంలో త‌న‌కు స్థానం ల‌భించ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఉండ‌వ‌ల్లికి.. ఇప్పుడు మ‌రింత సెగ పెర‌గ‌డంతో విష‌యంపై ఆమె అధిస్టా నానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఆరా తీసింది. ఈ క్ర‌మంలో ఒక‌సీనియ‌ర్ నేత వెనుక ఉన్నార‌ని తేలింద‌ట‌. ఆయ‌నే ఇక్క‌డ గ్రూపుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని.. తెలిసి.. అవాక్క‌యిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

మాజీ మంత్రి అయిన‌.. ఆ నాయ‌కుడు.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. అయితే.. అది సాధ్యం కాలేదు. దీంతో పార్టీపై అలిగి..త‌ర్వాత‌.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. వైసీపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే.. ఉండ‌వ‌ల్లికి సీటును మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నార‌ని.. తెలిసింది. ఎందుకంటే.. ఆమె వైఎస్ కుటుంబానికి వ్య‌క్తిగ‌త డాక్ట‌ర్‌గా ఉన్నారు. ముఖ్యంగా సీఎం స‌తీమ‌ణి ఆరోగ్య బాధ్య‌త‌లు సైతం ఆమె చూస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో గెలిచినా.. ఓడినా ఆమెకే మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న స‌ద‌రు నాయ‌కుడు… ఉండ‌వ‌ల్లికి పొగ‌బెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. అందుకే గ్రూపుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌నకు అనుకూలంగా ఉన్న వ‌ర్గంతో శ్రీదేవి వ‌ర్గంపై దాడులు కూడా చేయిస్తున్నార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామంపై పార్టీ సీరియ‌స్‌గానే ఉంది. ఎస్సీ నేత‌ల్లో ఎంతోప‌ట్టున్న ఆయ‌న‌.. ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని.. ఇప్ప‌టికే స‌ల‌హాదారు చెప్పార‌ని స‌మాచారం. మ‌రి ఆయ‌న సీటు కోసం ప‌ట్టుబ‌డ‌తారో.. లేక ఉన్న ప‌ద‌వితోనే స‌ర్దుకు పోతారో చూడాలి.

Share post:

Popular