బాలయ్య సినిమాకు కాపీనా ఆచార్య ..ఏంటి కొరటాల ఇది..?

మెగాస్టార్ హీరో గా చరణ్ ఓ గెస్ట్ పాత్రల్లో నటించిన సినిమా ఆచార్య. ఎన్నో భారీ అంచనాల మధ్య నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది. ఫస్ట్ షోతోనే అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసి బయటకు వచ్చిన జనాలు సైతం..అదే మాట చెప్పుతున్నారు. కొరటాల నుండి ఎక్స్ పెక్ట్ చేసిన కధ కాదు ఇది అని.. అసలు మెగా హీరోల రేంజ్ కి ఈ స్టోరీ ఎలా సూట్ అవుతుంది అనుకున్నారో తెలియడం లేదంటూ..చెప్పుకొస్తున్నారు.

కేవలం మెగా యాంటి బ్యాచ్ నే కాదు.. మెగా అభిమానులు కూడా..స్టోరీ నిల్ అని..మెగాస్టార్ చరణ్ పర్ ఫామెన్స్ బాగున్నా..కధ లేనప్పుడు సినిమా హిట్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే , ఇలాంటి భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఆచార్య గురించి ఓ షాకింగ్ మ్యాటర్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఆచార్య సినిమా మొత్తం అమ్మవారి కాన్సెప్ట్ పై వెళ్తుంది. ధర్మశ్ధలి, పాద ఘట్టం..ఈ రెండే మనం మూవీలో చూస్తాం. చరణ్ ధర్మం కోసం ఎలా నిలబడ్డాడు.. ఆ ధర్మాని కాపడడానికి ఎలా ప్రాణాలను తీసాడు .. చిరంజీవి చరణ్ ఆశయం నెరవేర్చడం..టోటల్ సినిమా కాన్సెప్ట్ ఇదే.

అయితే, ఈ ఆచార్య సినిమా..బాలయ్య రీసెంట్ మూవీ అఖండ నుండి డైరెక్టర్ కొరటాల కాపీ కొట్టాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన..అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమానే కొన్ని లైన్స్ మార్చి..కొరటాల ఆచార్య గా తెరకెక్కించాడు అంటున్నారు కొందరు నెటిజన్స్. అఖండ‌లో వున్న చాలా అంశాలు ఇందులో వుండ‌డమే అందుకు కారణం అయిన్నట్లు తెలుస్తుంది. ప్ర‌ధాన‌మైంది ధ‌ర్మాన్ని నిల‌బెట్ట‌డమే బాలయ్య అఖండలో చెప్తారు. ధ‌ర్మం గాడి త‌ప్పితే శివుని అంశ అఘోరా వ‌చ్చి ఎలా ప‌రిష్క‌రించింది అనేది అఖండ సినిమా స్టోరి. ఇంచు మించు ఇక్కడ చిరంజీవి ఆచార్య కూడా అలాగే ఉంటుంది. కాక‌పోతే అక్కడ బాలయ్య అఘోర గా ఉంటే ఇక్కడ చిరంజీవి న‌గ్జ‌లైట్ గా కనిపిస్తారు. ఈ రెండు సినిమాల్లోనూ కామ‌న్ అంశం మైనింగ్ మాఫియా… అఖండ‌లో శివుని నేప‌థ్యం అయితే ఇందులో అమ్మ‌వారి నేప‌థ్యం అంతే తేడా అంటూ కొరటాల కాపీ కొట్టాడు అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Popular