వ‌రంగ‌ల్ శ్రీను కోస‌మైనా ‘ ఆచార్య ‘ హిట్ అవ్వాలి… తొక్కేసి ఎక్కేస్తాఅనేటోడికి గుణ‌పాఠం కావాలి..!

మ‌న తెలుగు సినిమా రంగంలో హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల క‌ష్టాన్ని పీల్చిపిప్పి చేస్తూ గుంజుకుంటోన్న దొంగోళ్లు త‌యార‌య్యారు. చెప్పేవ‌న్ని అబ‌ద్ధాలు.. మాట్లాడేవి కోత‌లు.. త‌ప్పుడు లెక్క‌లు.. మాయ మాట‌లే పెట్టుబ‌డిగా పెట్టి బ‌తికేస్తూ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తున్నారు. ఓ సినిమా తీయాలంటే దానికోసం కొన్ని వేల మంది క‌ష్టం ఉంటుంది.. కొన్ని కోట్లు పెట్టుబ‌డులుగా పెడ‌తారు. తీరా రిలీజ్ చేయాలంటే థియేట‌ర్లు ఇవ్వ‌రు.. పైగా వాళ్లు చెప్పిన రేటుకు.. వాళ్ల‌కే ఇవ్వాలి.. లేదంటే లేదు.. పోని హిట్ అయ్యాక ఒరిజిన‌ల్‌గా వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతో చూప‌రు. అంతా త‌ప్పుడు లెక్క‌లే.. ఈ తంతు గ‌త కొన్నేళ్లుగా న‌డుస్తోంది.

ఈ డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో కొంద‌రు సినిమాను చంపేసే కిల్ల‌ర్ గాళ్లు త‌యార‌య్యారు. అంటే ఇక్క‌డ అంద‌రిని ఒకేలా చెప్ప‌డం కాదు.. కొంద‌రు మాత్ర‌మే ఈ మాయ‌గాళ్లు. ఈ డిస్ట్రిబ్యూష‌న్ రంగాన్ని శాసిస్తూ త‌మ‌కు తామే కింగ్‌లం అని చెప్పుకునే బొంగు గాళ్ల గురించి మాత్ర‌మే ఈ ఆర్టిక‌ల్‌. ఎవ‌రో ఎందుకు ఎన్టీఆర్ లాంటి వాడే ఏదో ఇబ్బందుల్లో ఉండి ఓ సినిమా రిలీజ్ చేసిపెట్ట‌మ‌ని అడిగితే అత‌డినో మోసం చేసి.. త‌ప్పుడు లెక్క‌లు చూపించినోడికి ఎలాంటోడిని అయినా మోసం చేయ‌డం పెద్ద క‌ష్టం కాదు. చివ‌ర‌కు మ‌హేష్‌బాబుకు సైతం ఈ దొంగ లెక్క‌లు చూసి విసుగు వ‌చ్చిందంటేనే ఇక్క‌డ ఆ మాయ డిస్ట్రిబ్యూట‌ర్ల బాగోతం ఎలా ఉందో తెలుస్తోంది.

పైగా ఇదేదో త‌మ సామ్రాజ్యం అన్న‌ట్టుగా నియంత మాదిరిగా మారుతున్నారు. ఈ రంగంలోకి ఎవ్వ‌రూ రాకూడ‌దు అన్న‌ట్టుగా వారి శైలీ ఉంటోంది. త‌మ‌ను కాద‌ని ఎవ‌రు అయినా ఓ సినిమా కొంటే వారికి చుక్క‌లు చూపిస్తూ బ‌తుకుతున్నారు ఈ వంక‌ర మూతి గాళ్లు. అయితే ఒక‌ప్పుడు ఉన్నంత బ‌డాయి ఇప్పుడు లేదు. వ‌రుస‌గా జ‌డ్జ్‌మెంట్‌లు త‌న్నుతున్నాయి. సొంత బ్యాన‌ర్లో తీసిన సినిమాలు ఫ‌ట్ మంటున్నాయి. సొంత హీరోల‌తో తీసినా ఫ‌ట్ మంటున్నాయి. ఏదే కొన్ని థియేట‌ర్ల‌ను చేతులో పెట్టుకుని బొంబాయ్ క‌బుర్లుతో జ‌నాల‌ను భ్ర‌మ‌ల్లో ఉంచ‌డ‌మే త‌ప్పా చేసేదేం లేదు.

నైజాం ఆశాకిర‌ణం వ‌రంగ‌ల్ శ్రీను :
ఇలాంటి టైంలో తెలుగు సినిమా పంపిణీ రంగంలోకి ఆశాకిరణంగా దూసుకు వ‌చ్చాడు వ‌రంగ‌ల్ శ్రీను. వ‌రంగ‌ల్ శ్రీను చ‌దివింది ఇంజ‌నీరింగ్‌.. సినిమా రంగంలో ఏదో సాధించాల‌న్న త‌ప‌న‌తోనే ఉన్న‌త ఉద్య‌గం వ‌దులుకుని ఇండ‌స్ట్రీలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశాడు. 15 ఏళ్ల అనుభ‌వం. చివ‌ర‌కు డిస్ట్రిబ్యూష‌న్లోకి క‌బాలీతో ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాయే సూప‌ర్ స్టార్ సినిమా. ఆ త‌ర్వాత గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ – ఇస్మార్ట్ శంక‌ర్ – క్రాక్ ఇలా మంచి సినిమాలు చేశాడు. క‌రెక్టు లెక్క‌ల‌తో నిర్మాత‌ల‌కు ఓ రూపాయి లాభం వ‌చ్చేలా చేస్తున్నాడు. ఇలాంటోడు ఉంటే మ‌న పప్పులు ఉడ‌క‌వ్‌.. ఆట‌లు సాగ‌వ్ అన్న భ‌యంతో వాళ్లలో వ‌ణుకుడు మొద‌లైంది.

ఇంకేముందు వ‌రంగ‌ల్ శ్రీనును తొక్కేయాల‌న్న కుట్ర‌లు మొద‌ల‌య్యాయి. మ‌నోడి సినిమాల‌కు థియేట‌ర్లు లేకుండా చేస్తున్నారు. సినిమాలు క‌లెక్ష‌న్ల మీద ఉండ‌గానే లేపేయ‌డం మొద‌లు పెట్టారు. అయినా ఆ కుట్ర‌ల‌ను చేధించాడు.. ఎదుర్కొని నిల‌బ‌డ్డాడు. చివ‌ర‌కు మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఆచార్య సినిమా రైట్స్‌ను కొర‌టాల శివ లాంటి స్టార్ డైరెక్ట‌రే స్వ‌యంగా పిలిచి మ‌రీ ఇచ్చారు. అది న‌మ్మ‌కం అంటే.. మోస‌పు సొమ్ము వెన‌కేసుకుంటే.. ఎలా వ‌చ్చిందో అలానే పోతూ ఉంటుంది.

ఈ రోజు ఇండ‌స్ట్రీలో ఈ మోసం గాళ్ల‌ను అంద‌రూ ముందు పొగ‌డుతూ వెన‌కాల చీ తూ అని ఉమ్మేస్తున్నారు. చివ‌ర‌కు వాళ్ల బ‌తుకులు మొహాన ఉమ్మినా తుడుచుకుపోయేంత నీచానికి దిగ‌జారిపోయాయి. ఎందుకో వ‌రంగ‌ల్ శ్రీను మాట‌ల్లో నిజాయితీ క‌న‌ప‌డుతోంది. అత‌డి పోరాటానికి ఇప్పుడు ఇండ‌స్ట్రీలో నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌తో పాటు స్టార్ హీరోల స‌పోర్ట్‌గా అండ‌ర్ క‌రెంట్‌గా ఉంది. ఇప్పుడు అంద‌రూ కూడా ఆచార్య హిట్ అయితే భ‌విష్య‌త్తులో త‌మ సినిమాల‌కు కూడా న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు. అందుకే మెగాభిమానులు మాత్ర‌మే కాదు.. సినీ వ‌ర్గాలు అన్ని వ‌రంగ‌ల్ శ్రీను కోసం అయినా ఆచార్య సూప‌ర్ హిట్ అయ్యి భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టాల‌ని కోరుకుంటున్నాయి.

ఆచార్య హిట్ అయితే అస‌లు హిట్ సినిమా ద‌మ్మెంత.. మాయ లెక్క‌లు లేకుండా నికార్సైన వ‌సూళ్లేంటి అన్న‌ది తెలుస్తుంది. ఏ రంగంలో అయినా మోనోప‌లి అనేది ఆ రంగాన్ని ప‌త‌నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో వాళ్ల మోనోప‌లితో వాళ్ల ప‌త‌నం వాళ్లే రాసుకుంటున్నారు. అయితే ఇక్క‌డ ఉన్న మ‌రి కొంత‌మంది నిజాయితీ ప‌రులు కూడా శ్రీను లాంటి వాళ్ల‌కు స‌పోర్ట్ చేస్తే అప్పుడు అస‌లు రంగు ఏంటో బ‌య‌ట ప‌డుద్ది. మ‌రి శ్రీను ఆశ‌లు ఆచార్య ఎలా నెర‌వేరుస్తాడు ? అన్న‌ది చూడాలి.