పుష్ప రాజ్ మారుతన్నాడా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో చేసిన యాక్టింగ్, ఆయనకు మరింతపేరును తీసుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమాలో బన్నీ లుక్స్ పరంగా ఎలా ఉన్నాడో మనం చూశాం. అయితే ఇప్పుడు సీక్వెల్‌లోనూ ఇలాగే కనిపిస్తాడా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. పుష్ప 2లో బన్నీ రఫ్ లుక్‌లోనే కనిపించినా, అది స్టైలిష్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ పాత్ర కోసం మరోసారి కొంతమేర మేకోవర్‌లోకి బన్నీ వెళ్తాడనే వార్త వినిస్తోంది.

కాగా పుష్ప2లో కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఈ సినిమాను కూడా తనదైన టేకింగ్‌తో రసవత్తరంగా మార్చనుండగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా పుష్ప2ను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Share post:

Latest