కొత్త కోడలు అలియాకు అత్త అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్..ఎన్ని కోట్లంటే..!

ఏది ఏమైతేనేం..ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బార్డ్స్.. అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ లు ఐదేళ్లు ప్రేమించుకుని..మూడు సార్లు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుని..ఫైనల్లీ ఏప్రిల్ 14న దగ్గర బంధువులు, కుటుంబసభ్యుల నడుమ..మూడు ముళ్ల బంధంతో ఒక్కటైయారు. గత నాలుగు రోజుల నుండి వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు..నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి లో అలియా వేసుకున్న నగలు..కట్టుకున్న చీర..ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇక పెళ్లి తరువాత అలియాను ప్రేమగా ముద్దాడుతున్న రణ్‌బీర్‌ ..ఫోటో టోటల్ పెళ్లికే హైలెట్ గా నిలిచింది. టూ మచ్ హంగామా లేకుండా స్వీట్ అండ్ సింపుల్ గా అలియా-రణ్‌బీర్‌ ల పెళ్లి జరిగిపోయింది. నిజానికి వీళ్ల పెళ్లికి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవ్వరు కూడా హాజరు కాలేదట. కానీ, ఈ కొత్త జంటకు..దాదాపు అందరు ప్రముఖులు..వాళ్ల స్దాయి కి తగ్గ రేంజ్ లో బహుమతులు పంపిచారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా కొత్త కోడలకు రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌..కళ్ళు చెదిరే గిఫ్ట్ ఇచ్చిన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నీతూ కపూర్‌ తన కొడుకు-కొడలికి ఓ ఖరీదైన 6 Bed Rooms ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. సకల సౌకర్యాలు కలిగి ఉన్న ఈ ఫాట్ ఖరీదు అక్షరాలు 40 కోట్లు అన్ని టాక్ వినిపిస్తుంది. ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్టుమెంట్‌లో అలియా-రణ్‌బీర్‌ల కోసం రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌ ఈ ఫ్లాట్ ను కొనుగోళ్లు చేశారట. అంతేకాదు పెళ్లి తరువాత ఇద్దరు ఈ ఫ్లాట్ లోనే కాపురం ఉంటున్నారట. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, కత్రినా..అలియా కోసం కాస్ట్లీ నెక్ సెట్, రణ్‌బీర్‌ కోసం ప్లాటినం బ్రెస్ లెట్ గిఫ్ట్ గా ఇచ్చిన్నట్లు సమాచారం.

Share post:

Latest