ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డ్ ఖాయం..?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లను రాబడుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా చూసిన వారంతా ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్‌కు ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ రావాల్సిందే అని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ‘కొమురం భీముడో’ పాటలో తారక్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులందరూ కూడా కంటతడి పెడుతున్నారు. గూస్‌బంప్స్ తెప్పించే నటనతో తారక్ ఆడియెన్స్‌ను సీట్లకు కట్టిపడేశాడు. ముఖ్యంగా ఈ పాటలో తారక్ ఎక్స్‌ప్రెషన్స్‌ అదరహో అనిపించాయని ప్రేక్షకులను అంటున్నారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఈ మధ్యకాలంలో ఎవరూ చేయలేదని.. ఖచ్చితంగా తారక్ నటనకు అవార్డులు రావాల్సిందే అంటున్నారు.

రోజురోజుకూ తారక్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటంతో అటు సినీ వర్గాలు సైతం తారక్‌కు అవార్డులు రావడం ఖాయమని అంటున్నాయి. మరి నిజంగానే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పర్ఫార్మెన్స్‌కు తారక్ నేషనల్ అవార్డు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Share post:

Popular