కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. మాస్టర్‌తో రికార్డులు తిరగరాసిన విజయ్ తాజాగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ రిలీజ్‌కు రెడీగా ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
విజయ్‌కు గతంలోనే తెలుగు మార్కెట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో తన తెలుగు మార్కెట్‌ను మరింతగా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. బీస్ట్‌ను తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ తన కెరీర్ల 66వ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
ఈ సినిమాతో విజయ్ నేరుగా తెలుగులో అడుగు పెట్టనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్టును పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ పక్కన హీరోయిన్లుగా టాలీవుడ్లోనే క్రేజీ హీరోయిన్లుగా ఉన్న రష్మిక మందన్న – పూజా హెగ్డేలను లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ విజయ్ పక్కన బీస్ట్‌లో పూజ హీరోయిన్గా నటించింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో విజయ్ అంటే మామూలు రచ్చ ఉండదు..!