ఒక్కటైన సిరి-శ్రీహన్..ఆ మెసేజ్ చూస్తుంటే షన్నుకి మండిపోతుందట..?

షణ్ముఖ్, దీప్తి, సిరి, శ్రీహన్..ఈ నాలుగు పేరులు గత కొన్ని నెలలుగా మీడియా లో ఓ రేంజ్ లో ట్రేండ్ అవుతున్నాయ్. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. తమలోని టాలెంట్ ను నలుగురికి పరిచయం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ నలుగురు. వీళ్లల్లో టాప్ ఎవరంటే కళ్లు మూసుకుని..చెప్పే పేరు.. షణ్ముఖ్ జశ్వంత్. ఓ స్టార్ హీరో కి సరి సమానంగా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు. షన్ను ఓ పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ అవుతుంది.

అదే షన్ను ఓ అమ్మాయిని ప్రేమిస్తూ..మరో అమ్మాయికి దగ్గరవుతుంటే..బాబోయ్ ఇంకేముంది ఖేల్ ఖతం దుకాణ్ బంద్. అదే జరిగింది.. బిగ్ బాస్ షోలో. తన పేరుని మరింత పెంచుకోవడానికి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన షన్ను..తోటి కంటెస్టేంట్ సిరి తో మెలిగిన తీరు తో ఉన్న పరువును పొగొట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే హౌస్ నుండి బయటకు రాగానే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దీప్తి బ్రేకప్ చెప్పేసింది. కొన్ని రోజులు మీడియాలో హాట్ టాపిక్ గా కనిపించిన ఈ జంట..ప్రస్తుతం వాళ్ళ ఫోకస్ కెరీర్ పై పెట్టారు.

అయితే వీళ్ళతో ఆటు సిరి-శ్రీహన్ కూడా విడిపోతున్నారంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరిగినా..వాటి అన్నింటిని కొట్టిపారేస్తూ సిరి-శ్రీహన్..రీసెంట్ గా కలిసి యాంకర్ రవి ఇంటికి వెళ్ళారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. అయితే త్వరలోనే వాలెంటైన్స్ డే రాబోతుంది..ఆ రోజు ప్రేమ పావురాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. అన్నీ బాగుంటే షన్ను కూడా దీప్తీ తో సెలబ్రేట్ చేసుకునే వాడు కానీ ఇప్పుడు సీన్ రీవర్స్.

కాగా, షన్నుకి మాత్రం వాలెంటైన్స్ డే స్పెషల్ మెసేజ్‌లు తెగ వస్తున్నాయట. ఇక రీసెంట్ గా షన్ను కి వచ్చిన మెసేజ్ ..”హే షన్ను, నీ వాలెంటైన్స్ డే స్పెషల్ అవుట్ ఫిట్ మా దగ్గర ఉన్నాయి.. నీ వాలెంటైన్స్ డే స్పెషల్ ప్లాన్స్ ఏంటో చెప్పు” అనే ఓ మెసేజ్‌ ను షేర్ చేస్తూ..క్రింద అరేయ్..అంటూ పోస్ట్ చేశాడు. దీని ని చూసిన నెటిజన్స్..షన్ను కి మండిపోతున్నట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది పుండు మీద కారం చల్లినట్టుగానే ఉంది గా అంటూ మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. అసలే షన్ను బ్రేకప్ బాధలో షన్ను ఉంటే.. ఇలాంటి మెసేజ్‌ లు ఏంటి రా బాబు అంటూ షన్ను అభిమానులు ఫీల్ అయిపోతున్నారు. మరి చూడాలి ఈసారి షన్ను తన వాలెంటైన్స్ డే ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో..?

Share post:

Latest