భయపడిపోతున్న నిర్మాతలు.. కారణం స్టార్ హీరోయిన్లు?

టాలీవుడ్ లో గత కొంత కాలం నుంచి హీరోయిన్ల సమస్య వేధిస్తోంది అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్లు అవకాశాల కోసం ఎదురు చూసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం స్టార్ హీరోల సరసన నటించే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ల పేర్లు వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. ఈ క్రమంలోనే ఎంతో మంది జూనియర్ హీరోల సరసన నటిస్తున్న వారు సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఒప్పుకోవడం లేదు. ఇలా సీనియర్ హీరోల సరసన నటించే హీరోయిన్ కొద్ది మంది ఉండడంతో ఇక వారు పారితోషికం కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి.

 

ఇక స్టార్ హీరోతో సినిమా తీస్తున్నప్పుడు పక్కన అడపాదడపా హీరోయిన్ ఉంటే బాగుండదు కాబట్టి చేసేదేమీ లేక అటు నిర్మాతలు కూడా టాప్ హీరోయిన్లను అడిగినంత ఇచ్చి సినిమాల్లోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇలా స్టార్ హీరోయిన్ లు అడుగుతున్న రెమ్యూనరేషన్ మాత్రం ఎప్పటికప్పుడు అటు నిర్మాతలకు షాక్ ఇస్తోంది అన్నది ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్. అయితే మొన్నటి వరకూ హీరోయిన్లకు పారితోషికం ఇవ్వడం ఒక క్యారీవ్యాన్ కేటాయించడం ఫుడ్ చూసుకోవడం చేసేవారు నిర్మాతలు.

కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్లకు రెమ్యునిరేషన్ మాత్రమే కాదు సిబ్బంది ఖర్చులు కూడా చూసుకోవాల్సి వస్తూ ఉండటంతో నిర్మాతలు జేబులకు చిల్లులు పడుతున్నాయి అని తెలుస్తోంది. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు దాదాపు తమతో పాటు వేగంగా 12 మంది సిబ్బందిని తెచ్చుకుంటున్నారట. ఇందులో హెయిర్ స్టైలిస్ట్, మేకప్ చేసే వాళ్ళు బౌన్సర్లు, పర్సనల్ సిబ్బంది కూడా ఉంటున్నారట. ఇక వీరందరికీ కూడా హోటల్ వసతి దగ్గర నుంచి ఆహారం వరకు అన్నీ నిర్మాతలే దగ్గర చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయట. ఇలా ఒక్కో స్టార్ హీరోయిన్ సిబ్బందికి రోజుకి అన్ని కలిపి లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా స్టార్ హీరోయిన్లను తీసుకోవడం ఏమో కానీ వారి సిబ్బందికి కూడా ఖర్చు పెట్టడం నిర్మాతలను తెగ ఇబ్బంది పెట్టేస్తుందట. దీంతో స్టార్ స్టార్ హీరోయిన్ లను సినిమాలో పెట్టుకోవడానికి భయపడిపోతున్నారట టాలీవుడ్ లో నిర్మాతలు.