స్నేహితులుగా ఉన్న వర్మ, వైస్ జగన్ ల మధ్య ఎక్కడ చెడింది

చాలా కాలంగా ఏపీ సీఎం జగన్ కు రామ్ గోపాల్ వర్మ మంచి సపోర్టర్ గా ఉన్నాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు సినిమాలు చేసి.. వైసీపీకి జనాల్లో మంచి మైలేజీ వచ్చేలా చేశాడు. అంతేకాదు..జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా తను వెళ్లాడు. సీఎంను సన్మానించాడు కూడా. అలాంటి జగన్ సర్కారు మీద ఆర్జీవీ విమర్శలు ఎక్కుపెట్టాడు. జగన్ కు ఒకప్పటి మిత్రుడు ఇప్పుడు శత్రువుగా మారాడు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు లొల్లి ఇప్పుడు వారి మధ్య గ్యాప్ కు కారణం అయ్యింది. వాస్తవానికి టికెట్ల ధరలను తగ్గించడంపై సినిమా పరిశ్రమ పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చాలా మంది సినీ పెద్దలు సర్కారు తీరును తప్పుబడుతున్నారు.

- Advertisement -

తాజాగా పలువుర హీరోలు, దర్శకులు సైతం ఏపీ సర్కారును టార్గెట్ చేస్తున్నారు. హీరో నాని తొలుత ఏపీ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టారు. కిరాణా కొట్ట కలెక్షన్లకన్నా సినిమా కలెక్షన్లు తక్కువ వచ్చేలా టికెట్ల ధరలు ఉన్నాయని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు నానిని టార్గెట్ చేయడం వివాదం అయ్యింది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ టికెట్ల ధర తగ్గింపు గురించి మాట్లాడాడు. ట్విట్టర్ వేదికగా ఏపీ మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నాడు. టికెట్ల రేట్లు తగ్గించడానికి చేయడానికి అసలు ప్రభుత్వానికి ఏ హక్కు ఉందంటూ ప్రశ్నలు సంధించాడు. రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకుంటే జగన్ కు ఇంత ఇమేజ్, ఫాలోయింగ్ వచ్చేది కాదని చెప్పాడు. పుచ్చిపోయిన టమాటాలు వెనక్కివ్వడానికి.. టమాటాలు కొని రుచి చూసిన తర్వాత రుచి బాగోలేదని తిరిగి ఇవ్వడానికి తేడా చాలా ఉందన్నాడు. ఏ వస్తువుకైనా ధర నిర్ణయించే హక్కు తయారీదారుడిదేనంటూ తేల్చి చెప్పాడు. సీఎం జగన్, మంత్రులు పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని కలిసి రాజమౌళి కంటే గొప్ప సినిమా తీసి పేద ప్రజలకు ఉచితంగా చూపించాలని ఆర్జీవీ కామెంట్ చేశాడు. జగన్ తనకు ఎంత మిత్రుడైనా తనూ టికెట్ల ధరల తగ్గింపు మూలంగా ఇబ్బందులు పడతాడు కాబట్టే ఏపీ సర్కారును టార్గెట్ చేశాడనే మాటలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular