రాధేశ్యామ్ రిలీజ్‌పై రాధాకృష్ణ ట్వీట్.. క్లారిటీ ఏది బాబాయ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ పనులు అన్నీ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను ఫిక్షనల్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహం ఇప్పుడు మరోసారి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే బడా చిత్రాలు అన్నీ కూడా తమ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం సైతం రిలీజ్‌ను వాయిదే వేయడంతో ఇప్పుడు రాధేశ్యామ్ చిత్రం కూడా తన రిలీజ్‌ను వాయిదా వేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర దర్శకుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు.

‘‘సమయాలు కఠినమైనవి. హృదయాలు బలహీనంగా ఉన్నాయి. మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి ఉన్నతంగా ఉండండి’’ అంటూ రాధాకృష్ణ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు. అయితే చాలా మందికి ఈ ట్వీట్ సరికొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. అసలు నిజంగానే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేక ఇన్‌డైరెక్ట్‌గా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు పేర్కొన్నాడా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇదే ప్రశ్నను ఓ నెటిజన్ దర్శకుడిని అడగ్గా.. అలాంటిది ఏదైనా ఉంటే నేరుగా చెబుతానంటూ రాధాకృష్ణ బదులిచ్చాడు.

దీంతో ఇప్పటికైతే రాధేశ్యామ్ చిత్రం రిలీజ్‌పై ఎలాంటి అపోహలు వద్దని దర్శకుడు చెబుతున్నట్లు కనిపిస్తున్నా, ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా వాయిదా వేయబోతున్నట్లు ఇస్తున్న హింట్‌లాగే ఉందని చాలా మంది అంటున్నారు. రాధేశ్యామ్ నిజంగానే సంక్రాంతి బరిలో రిలీజ్ అయితే ఈపాటికి ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతుండాలి. కానీ కేవలం ఓ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మాత్రమే చేసిన ఈ సినిమా, సంక్రాంతి బరిలో దిగుతుందనే గ్యారెంటీ లేదు బాబాయ్ అంటున్నారు చాలా మంది నెటిజెన్లు.

Share post:

Popular