‘పుష్ప’ పార్ట్ 1 కోసం సుకుమార్ అన్ని కోట్లు వెస్ట్ చేశాడా…!

2021 ఇయర్ ఆఖరులో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో విడుదలైన మాస్ మసాలా సినిమా ‘పుష్ప’ సినిమా డివైడ్ టాక్ తో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ తో కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది .రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో, ఓవర్సీస్ లో పుష్ప భారీ వసూళ్లను కలెక్షన్ చేస్తుంది.పుష్ప సినిమా ఒకే పార్ట్ అని మొదలుపెట్టి కధ నేపథ్యం ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం .ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ అని సినిమాను విడుదల చేశారు . ఈ పార్ట్ కోసం దాదాపు రూ.180 కోట్లు ఖర్చు చేసినట్లు ఫిలిం ఇండస్ట్రీ లో గుసగుసలు వినుపిస్తున్నాయి . అయితే ఈ పార్ట్ లో చాలా సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేశారట.

పార్ట్ 1 ఎడిటింగ్ లో పోయిన సన్నివేశాలకు ఖర్చు పెట్టిన మొత్తమెంతో తెలుసా..? దాదాపు రూ.12 కోట్లు అంట . ఈ ఎపిసోడ్లో ఓ భారీ యాక్షన్ సీన్ ను కూడా డిలీట్ చేసారని ,కనీసం ఈ సన్నివేశాలను సెకండ్ పార్ట్ కూడా పనికి రావంటా. దీంతో వేస్టేజ్ పార్ట్ చాలా ఎక్కువైందని సమాచారం. అలా డిలీట్ చేసిన సన్నివేశాలను చిత్రం
ప్రమోషన్స్ కోసం ఇప్పుడు ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తుంది మైత్రి నిర్మాణ సంస్థ.

ఒక భారీ బడ్జెట్ సినిమా తీయడమంటే మాములు విషయం కాదు. ఈ రోజుల్లో రోజుకి ప్రొడక్షన్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. ‘పుష్ప’ సినిమా షూటింగ్ విషయంలో ఎన్ని రోజులు వేస్ట్ అయిందో కానీ మొత్తంగా దాదాపు రూ.12 కోట్ల విలువ చేసే సన్నివేశాలను డస్ట్ బిన్ లో వేసాడంట డైరెక్టర్ సుకుమార్. ముందే కధ స్క్రిప్ట్ సరిగా ఉంటె ఈ వేస్టేజ్ తగ్గి ఉండేది.

సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 2 కోసం ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తారో చూడాలి . ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది .సెకండ్ పార్ట్ మొత్తం అల్లు అర్జున్, మలయాళం హీరో ఫహద్ ఫాజిల్ చుట్టూ తిరగనుంది. ఫస్ట్ పార్టీలో మంచి నటులు ఉన్న వాళ్ల పాత్రలు తేలిపోయాయి . దానితో సుకుమార్ పుష్ప పార్ట్ 2 ఎక్కువ వెయిటేజ్ ఇవ్వబోతున్నారు.