కృష్ణ నుంచి తేజ వరకు.. కొడుకును కోల్పోయిన వారు వీళ్లే?

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా రమేష్ బాబు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు చనిపోవడంతో శోకసముద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. కళ్ళముందే కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులకు ఇలా అర్ధాంతరంగా వారసులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.

 

నందమూరి ఫ్యామిలీ లో గత కొంత కాలం నుంచి ఎంతోమంది వారసులు వివిధ ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ అరుదైన వ్యాధి తో బాధ పడుతూ చివరికి కన్నుమూశారు. పెద్ద కొడుకు మరణం స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ను ఎంతగానో కలిచివేసింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదలడం తో బాధ నుంచి తేరుకోవడానికి హరికృష్ణకు చాలా సమయమే పట్టింది.

రచయిత పరుచూరి బ్రదర్స్ కి కూడా పుత్రశోకం తప్పులేదు అని చెప్పాలి. పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రఘుబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసి ఉండకపోవచ్చు. ఈయన అనారోగ్యంతో బాధపడుతూ హఠాత్ మరణం చెందారు. ప్రతి ఏడాది వారసుడు పేరుమీద నాటక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రచయితలు.

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు కూడా అనుకుని విధంగా కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. కోట శ్రీనివాస్ రావు తనయుడు కోట ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కోటా శ్రీనివాసరావు కొన్నాళ్ళపాటు సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు.

కమెడియన్ల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బాబు మోహన్ కూడా చిన్న వయసు కొడుకుని కోల్పోయి ఎంతగానో బాధలో మునిగిపోయారు. ఆయన కుమారుడు పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు.

దివంగత నటుడు గొల్లపూడి మారుతి రావు కి కూడా పుత్రశోకం తప్పలేదు. గొల్లపూడి తనయుడు శ్రీనివాస్ చిన్న వయసులోనే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాగా దర్శకుడు తేజ కుమారుడు కేవలం ఆరేళ్ల వయస్సులోనే చనిపోవడంతో ఆయన ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పోయిన బాధ లో ఎన్నో ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు దర్శకుడు తేజ. నటుడు ప్రకాష్ రాజ్ కు సైతం పుత్రశోకం తప్పలేదు. చిన్న వయసులోనే కొడుకు మరణంతో ఎంతగానో కుంగిపోయారు ప్రకాష్ రాజ్. డాన్స్ మాస్టర్ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ప్రభుదేవా కుమారుడు సైతం చిన్నవయసులోనే ప్రాణాలు వదిలాడు.