క్రికెట్ మీద పిచ్చి తో.. జయలలిత ఏం చేసేవారో తెలుసా?

సాధారణంగా ప్రేక్షకులందరూ సినీ సెలబ్రిటీల ను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు.ఇక తమ అభిమాన నటీనటులు ఏదైనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటే మురిసిపోతూ ఉంటారు.. అచ్చం ఇలాగే సెలబ్రిటీలు కూడా ఇతర హీరోలను క్రికెటర్లను అభిమానిస్తూ ఉండటం చేస్తూ ఉంటారు. ఇక సినిమా రంగంలో కొనసాగుతూ క్రికెటర్లను అమితంగా అభిమానించే వారిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒకప్పటి హీరోయిన్ జయలలిత కూడా అతీతులు ఏం కాదు అనే చెప్పాలి. హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొన్ని రోజుల్లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించారు జయలలిత.. అందం అభినయం నటనలో డాన్స్ లో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.

 

ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి ఏకంగా ప్రభంజనమే సృష్టించారు. ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తమిళ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ తమిలుల అమ్మగా మారిపోయారు. ఇలా ఒకప్పుడు హీరోయిన్ గా ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా రాణించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిన్నప్పటినుంచి క్రికెట్ ఆటను ఎంతో పిచ్చిగా అభిమానించే వారట. ఇక జయలలితకు క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని చూసి ఆడవాళ్లు క్రికెట్ ఇష్టపడటం ఏంటి ఇది మగవాళ్ల గేమ్ అంటూ కామెంట్ చేసేవాడట ఆమె తమ్ముడు.

 

ఈ క్రమంలోనే క్రికెట్ చరిత్ర గురించిన ఒక పుస్తకం చదివిన జయలలిత అసలు క్రికెట్ కనిపెట్టింది ఆడవాళ్లు అన్న విషయాన్ని తెలుసుకుని మరింత మురిసిపోయారట. అంతేకాదండోయ్ జయలలితతో పాటు ఆమె స్నేహితురాలికి కూడా క్రికెట్ పిచ్చి ఎక్కువ ఉండేదట. ఈ క్రమంలోనే తమిళనాడు లో ఎక్కడ టెస్ట్ మ్యాచ్ జరిగినా వెళ్లి చూసేవారట. చూడటం వీలు కాకపోతే కనీసం రన్నింగ్ కామెంట్రీ అయిన వివి సంతోషపడే వారట జయలలిత ఆమె స్నేహితులు. ఇక అప్పట్లో టీమిండియా కెప్టెన్ గా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని ఎక్కువగా అభిమానించే వారట జయలలిత. ఏ మాగజైన్ లో ఈయన ఫోటో కనిపించినా కత్తిరించుకుని తన ఆల్బంలో అతికించుకునే వారట. ఇక ఈ విషయాలు అన్నింటినీ కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో ఓ పత్రికకు రాసిన వ్యాసం లో తెలిపారు జయలలిత.

Share post:

Latest