అప్పట్లోనే ఎన్టీఆర్ ను వెనక్కి నెట్టిన చిరంజీవి..

January 8, 2022 at 3:15 pm

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి. టాలీవుడ్ లో మూడు దశాబ్దాల పాటు తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగాడు. ఆయన కెరీర్ 1983లో విడుదల అయిన ఖైదీ మూవీతో ఓ రేంజిలో పైకి లేచింది. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. అయితే హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ తో చిరంజీవి పోటీ పడ్డాడు. 1981లో చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. ఎన్టీఆర్ సినిమాలను చిరంజీవి సినిమాలు బీట్ చేయడం అప్పట్లో సంచలనం కలిగించాయి.

వాస్తవానికి చిరంజీవికి ఖైదీ సినిమా వరకు పెద్దగా స్టార్ డమ్ లేదు. ఎన్టీఆర్, క్రిష్ణ తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్నారు. అదే సమయంలో చిరంజీవి నిలదొక్కుకుననే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగాను 1981లో వచ్చిన చట్టానికి కళ్ళు లేవు సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో ఎన్టీఆర్ కొండవీటి సింహం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే చట్టానికి కళ్ళు లేవు చిత్రం ఎన్టీఆర్ కొండవీటి సింహం చిత్రాన్ని ఓవర్ టేక్ చేసింది.

అక్టోబర్ 7న విడుదలైన కొండవీటి సింహం 100 రోజులు ఆడగా.. చట్టానికి కళ్ళు లేవు అక్టోబర్ 30న విడుదలై 107 రోజులు ఆడింది. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా చట్టానికి కళ్ళు లేవు నిలిచి సంచలనం కలిగించింది. చిరంజీవి స్టార్ గా ఎదగడానికి చట్టానికి కళ్ళు లేవు సినిమా పునాదిగా మారిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఖైదీ సినిమాతో చిరంజీవికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెల్లడంతో సినిమాలను వదిలేశాడు. చిరంజీవి ఎన్టీఆర్ స్థానాన్ని భర్తీ చేశాడు. తిరుగులేని స్టార్ గా మెగాస్టార్ ఎదిగాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఊపుతో ముందుకు కొనసాగుతున్నాడు.

అప్పట్లోనే ఎన్టీఆర్ ను వెనక్కి నెట్టిన చిరంజీవి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts