సినిమానే నడిపించిన కన్నాంబ, ఎన్టీఆర్ ని సైతం వణికించింది

January 9, 2022 at 10:58 am

తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత నటన కనబర్చిన నటీమణి పసుపులేటి కన్నాంబ. ఒకేసారి రెండు భావాలను కళ్లలో పలికించిన గొప్ప నటి. ఓ వైపు సెంటిమెంట్ తో కంటతడి పెట్టించడమే కాదు.. మరో కోపాన్ని ప్రదర్శించేది. ఒకే సమయంలో రెండు భావాలను రెండు కళ్లలో చూపించేది. తొలితరం నటిగా దేశంలోనే అద్భుత నటన కనబర్చింది అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ఆడవాళ్లు నాటకాలు వేయడం అంటే… బరితెగించిన మనిషిగా, బజారు మనిషిగా చూసేవారు. కానీ ఆ నాటి కట్టుబాట్లను చీల్చుని బయటకు వచ్చింది కన్నాంబ. తనపై ఎన్ని అపవాదులు వేసినా.. వెనక్కి తగ్గకుండా మగవాళ్లకు పోటీగా నాటకాలు వేసి మెప్పించింది తను. అయినా తనకున్న ఆర్థిక ఇబ్బందులు చాలా కష్టపెట్టేవి.

ఒకానొక సమయంలో వినుకొండలో ఓ నాటకం వేశారు. అయిపోయాక.. ఓ వ్యక్తి కన్నాంబ దగ్గరికి వచ్చాడు. మీ నాటకాలు నేను చూస్తుంటాను. అద్భుతంగా ఉంటాయి. కానీ మీరు ఎందుకు అన్ని నాటకాల్లో ఒకే చీరను ధరిస్తారు? అని అడిగాడు. నాటకాల కోసం కథలు చాలా ఉన్నాయి కానీ.. నాకు కట్టుకోవడానికి ఒక చీర మాత్రమే ఉందని చెప్పింది. ఆమె మాటకు తను చాలా బాధ పడ్డాడు. అతడికే కాదు.. చాలా మందికి కన్నాంబ తెరవెనుక పడిన కష్టాల గురించి పెద్దగా తెలియదు. పేదరికంలో ఉన్నా.. చాలా గొప్పగా కనిపించేది కన్నాంబ. కష్టాలను కూడా ఇష్టాలుగా మార్చుకుని బతికింది తను.

1935లో హరిశ్చంద్రా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది కన్నాంబ. తన చివరి సినిమా 1964లో వచ్చిన వివాహ బంధం. తను నటించి ఎన్నో సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. కన్నాంబ ముందు నటించేటప్పుడు ఎస్వీయార్, ఎన్టీఆర్ కూడా భయపడేవారు. ఆమె ముందు బాగా నటించకపోతే.. ఎవరూ నిలబడలేని భావించే వారు. సినిమాల మూలంగా కన్నాంబ కాదు.. కన్నాంబ మూలంగా సినిమాలు బాగుపడ్డాయి అంటారు చాలా మంది సినిమా జనాలు. అప్పటి హీరోలతో సమానంగా పారితోషకం తీసుకునేది తను. తన అద్భుత నటనతో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో అద్భుత గుర్తింపు తెచ్చుకుంది కన్నాంబ.

సినిమానే నడిపించిన కన్నాంబ, ఎన్టీఆర్ ని సైతం వణికించింది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts