టాలీవుడ్ హిట్ కాంబోల్లో కిక్కిచ్చే సినిమాలు..ఇది ఫలిస్తే వేరే లెవల్

January 9, 2022 at 11:01 am

ఆయా హీరోలు, దర్శకుల మధ్య మంచి మంచి ర్యాపో ఉంటే.. సినిమాలు కూడా బాగానే వస్తాయి. మంచి విజయాలు అందుకుంటాయి. అయితే ఆయా హీరోలు, దర్శకుల కాంబోలో అంతకు ముందే హిట్ సినిమాలు వచ్చిన నేపథ్యంలో తాజాగా వారు మళ్లీ సినిమాలు చేస్తే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. తాజాగా మరికొన్ని కాంబోలు ఇండస్ట్రీలో హీట్ పెంచుతున్నాయి.

సంక్రాంతి పండుగకు బంగార్రాజు సినిమా జనాల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగ్ కు మంచి హిట్ ఇచ్చాడు దర్శకుడు కల్యాణ్. తాజాగా బంగార్రాజు పేరుతో తండ్రి కొడుకుల సినిమా తీశాడు. నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించడంతో జనాల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమ ఏమేరకు జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి.

బోయపాటి, బాలయ్య కాంబో అంటే జనాలు అబ్బా అంటారు. వీరిద్దరి మంచి బాండింగ్ ఏర్పడింది కూడా. అటు ఇప్పటికే అఖడంతో మంచి సక్సెస్ కొట్టిన బోయపాటి.. అఖండ సీక్వెల్ ఉండబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. అఖండ-2 తీయాలని ఉందని ఈ సినిమా నిర్మాతే స్వయంగా చెప్పడంతో నిజమే అనే భావన కలుగుతోంది. అటు బన్నీతో కలిసి బోయపాటి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు సుకుమార్, రాం చరణ్. తాజాగా వీరిద్దరు కలిసి మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే తామిద్దరం కలిసి మరోసారి పనిచేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీరి తాజా సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ కూడా రాజమౌళి ఇప్పటికే చెప్పాడు. అటు త్వరలోనే మహేష్, త్రివిక్రమ్ కూడా మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితతే వీరి తాజా సినిమా పాన్ ఇండియా రేంజిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుతం పలు క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. జనాలకు మంచి కిక్ ఇవ్వబోతున్నాయి.

టాలీవుడ్ హిట్ కాంబోల్లో కిక్కిచ్చే సినిమాలు..ఇది ఫలిస్తే వేరే లెవల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts