క్యారెక్టర్ కోసం ఈ హీరోయిన్లు బాగా కష్టపడ్డారట..

ఒకప్పటి నటీనటులకు.. ఇప్పటి యాక్టర్లకు భారీగా తేడా కనిపిస్తోంది. అప్పట్లో నటీనటులు దర్శకులు చెప్పినట్లు నటించి వెళ్లిపోయే వారు. కానీ ప్రస్తుతం స్క్రీన్ మీద తమ యాక్టింగ్, ఫర్ఫార్మెన్స్ ను ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు. ఏదో దర్శకుడు చెప్పినట్లు చెయ్యడం కాకుండా క్యారెక్టర్ ను అద్భుతంగా పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా సినిమాల్లో తమ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుని దానికి అనుగుణంగా హోమ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. హీరోయిన్లు తెగ కష్టపడుతున్నారు కూడా.

 

రాధేశ్యామ్ – పూజాహెగ్డే
పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో టీచర్ క్యారెక్ట్ చేసింది తను. అప్పటి డ్రెస్సింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో పాటు క్యారెక్టర్ ను అద్భుతంగా చేసేందుకు చాలా కష్టపడినట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

పుష్ప- సమంత
సమంత తను చేసిన తొలి ఐటెం సాంగ్ విషయంలో చాలా హోం వర్క్ చేసింది. పుష్ప సినిమాలో తను నటించిన ఊ అంటావా మావా అనే పాట కోసం ఎంతో శ్రమించింది. ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్లను పెట్టుకుని మరీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత తను చేయబోయే సినిమాల విషయంలో చాలా హోం వర్క్ చేస్తుంది సమంత.

పుష్ప- రష్మిక
పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేసింది. కన్నడ కు చెందిన ఈ అమ్మాయి తెలుగులో డబ్బింగ్ చెప్పి అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ సినిమా కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ వారెవ్వా అనిపించింది. ఈ సినిమాలో తన నటన, డ్రెస్సింగ్ అద్భుతంగా జనాలను ఆకట్టుకున్నాయి.

శ్యామ్ సింగ రాయ్- సాయి పల్లవి
ఈ సినిమా కోసం సాయి పల్లవి కూడా చాలా కష్టపడింది. ఇందులోని తన క్యారెక్టర్ కోసం బాగా హోం వర్క్ చేసింది. ఈ సినిమాలో జోగిని క్యారెక్ట్ చేసిన తను.. అప్పట్లో జోగినీలు ఎలా ఉండేదని తెలుసుకుని మరీ నటించింది.