రమేష్ బాబు సాహసయాత్రం మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

రమేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు. సామ్రాట్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాడు. బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత తను నటించిన మరికొన్ని సినిమాలు అంతగా ఆడలేదు. నటన తనకు వద్దని ఎన్ కౌంటర్ సినిమా తర్వాత యాక్టింగ్ మానేశాడు. అయితే సినిమాల మీద మచి అవగాన ఉన్న రమేష్ బాబు.. నిర్మాతగా మారాడు. తన తండ్రి పేరిటే కృష్ణ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పపాడు. అర్జున్, అతిథి చిత్రాలను తన తమ్ముడు మహేష్ బాబు హీరోగా నిర్మించాడు. దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా ఉన్నాడు. అయితే రమేష్ హీరోగా ప్రారంభమై కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అందులో ఓ ముఖ్యమైన సినిమా సాహసయాత్ర. ఇంతకీ ఈ సినమా ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం..

సాహసయాత్ర సినిమాకు తొలుత దర్శకుడు వంశీ పనిచేశారు. రచయిత సాయినాథ్‌తో కలిసి పూర్తి అడ్వెంచరేస్ స్టోరీ లైన్ తయారు చేశారు. వంశీ తయారు చేసిన కథను హీరో కృష్ణకు వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో చెన్నై లోని ప్రసాద్ థియేటర్ లో పాటల రికార్డింగ్ మొదలు పెట్టారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో సీతారామశాస్త్రి రాసిన పాటను మొదలు పెట్టారు. హీరోయిన్ ఓకే కాలేదు. విలన్ గా అమ్రేశ్ పురి ఓకే అయ్యాడు. ఆ తర్వాత నిర్మాతలకు, వంశీకి మధ్య గొడవ వచ్చింది. దీంతో తను తప్పుకున్నాడు. నిర్మాతలు కృష్ణ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు. దర్శకుడు కే.ఎస్.ఆర్. దాస్ తో మాట్లాడాడు. ఈ సినిమాకు దర్శకుడిగా ఓకే చేశాడు. మళ్లీ కథతో పాటు చాలా విషయాల్లో మార్పు వచ్చింది. హీరోయిన్లుగా గౌతమి, రమ్యకృష్ణ, రూపిణీ, మహా లక్ష్మిని ఓకే చేశారు. మ్యూజిక్ రాజ్ కోటి చేతుల్లోకి వచ్చింది. షూటింగ్ మొదలైంది.

ఈ సినిమా తొలి షెడ్యూల్ అండమాన్‌లో మొదలు పెట్టారు. రమేశ్ బాబు, గౌతమి మీద ఒక పాట.. రమేశ్ బాబు, మహా లక్ష్మి మీద మరో పాట తీశారు. ఫైట్ తో పాటు కొన్ని సీన్లను కూడా షూట్ చేశారు. ఆ తర్వాత షెడ్యూల్స్ తలకోన, సిమ్లా, బికనీర్ సహా పలు ప్రాంతాల్లో తీయాలి అనుకున్నారు. కానీ ఆర్ధిక కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది.