ట్విట్ట‌ర్ టాక్‌..`శ్యామ్ సింగరాయ్` హిట్టా..? ఫ‌ట్టా..?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల అయింది.

1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాని రెండు డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను పోషించాడు. అందులో ఫిలిం డైరెక్టర్ వాసు పాత్ర ఒక‌టి కాగా.. ప్ర‌జ‌ల‌కు కోసం పోరాటం చేసే శ్యామ్ సింగరాయ్ పాత్ర మ‌రొక‌టి. అలాగే సాయి ప‌ల్ల‌వి దేవ‌దాసిగా క‌నిపిస్తుంది. అయితే ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు చూసిన సినీ ప్రియులు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ‌దైన శైలిలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

రాహుల్ డైరెక్షన్, నాని- సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్, వారిద్ద‌రి కెమిస్ట్రీ ఎంతో బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి తన నటనతో ఇరగదీసిందనే టాక్ జోరుగా న‌డుస్తోంది. స్టోరీ లైన్ గట్టిగా కనెక్ట్ అయ్యింద‌ని.. ఫస్టాఫ్ కాస్త సాగదీతగా అనిపించినా, సెకండాఫ్ మాత్రం అదిరిపోయింద‌ని అంటున్నారు.

అలాగే క్లైమాక్స్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచాయ‌ని అంటున్నారు. సినిమా విజ్యూవల్స్ కు తగ్గట్టుగా మ్యూజిక్‌ను అందించాడంటూ మిక్కీజెమేయర్‌పై ఆడియన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మొత్తానికి ట్విట్ట‌ర్ టాక్ ప్ర‌కారం చూస్తే.. వ‌రుస అప‌జ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న నానికి.. ఈ సారి హిట్ ప‌డేలానే క‌నిపిస్తోంది.

Share post:

Latest