అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్స్..!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలలపాటు థియేటర్లను మూసివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా ప్రేక్షకులు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అందుకు కారణం కరోనా భయమే. కరోనా వల్ల ఈ ఏడాది అగ్ర హీరోలు నటించిన సినిమా ఏ ఒక్కటీ విడుదల కాలేదు. ముందుగా ధైర్యం చేసి థియేటర్లలోకి వచ్చిన సినిమా అఖండ. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా విడుదలైన అఖండ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

కరోనా వల్ల సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్లు వస్తాయో రావో అని నెలకొన్న భయాలను ఈ సినిమా పటాపంచలు చేసింది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత విడుదలైన మరో భారీ బడ్జెట్ సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అలాగే నాని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను సాధిస్తోంది.

కాగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూడు సినిమాలు త్వరలో ఓటీటీ ప్రేక్షకులను కూడా పలకరించనున్నాయి. ఇందుకు సంబంధించి రిలీజ్ డేట్లు కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాయి. ముందుగా అఖండ సినిమా హాట్ స్టార్ లో జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి రోజున స్ట్రీమింగ్ కానుంది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ ల పుష్ప సినిమా సంక్రాంతి కానుకగా పండుగ రోజు స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా నాని సాయి పల్లవిల శ్యామ్ సింగరాయ్ జనవరి ఆఖర్లో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ముగ్గురు అగ్ర హీరోలు నటించి సూపర్ హిట్ గా నిలిచిన మూడు సినిమాలు ఒకే నెలలో విడుదల కానుండటంతో ఓటీటీల్లో హంగామా కనిపించనుంది.

Share post:

Popular