తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షో నుంచి సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ ఇలా వరసగా ఎనిమినేట్ అవ్వగా.. ఫైనల్స్‌కి శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరి, మాస్‌లు చేరుకున్నారు.
ఈ ఐదుగురిలో శ్రీరామ్, సన్నీ, మానస్ ల మధ్యే అసలైన పోటీ నెలకొంది. ఈ ముగ్గురులోనే ఒకరు విజేతగా అవుతారని పలు సర్వేలు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ 19న బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ జరగబోతుండగా.. మేకర్స్ అందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసేశారు. అయితే ఇలాంటి తరుణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు తన మద్ధతు ప్రకటించారు.
ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు సింగర్ శ్రీరామ్. తాజాగా శ్యామల దేవి ఓ వీడియో సందేశం పంపారు. అందులో `హాయ్ శ్రీరామ్. బిగ్‌బాస్ షో చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయ్యావ్.
ఇప్పుడు బిగ్‌బాస్‌లో కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా గెలుస్తావ్. ఆల్ ది బెస్ట్` అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అంతే కాదు, శ్రీరామ్‌కు అందూ ఓట్లు వేసి గెలిపించాలని కూడా కోరారు. ఇక శ్రీరామ్‌ను గెలిపించేందుకు ఏకంగా ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్ రంగంలోకి దిగడంతో.. శ్రీరామ్ క్రేజ్ మరింత పెరిగి పోయింది.
https://www.instagram.com/p/CXiBFTrNja9/?utm_source=ig_web_copy_link