బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలున్న‌ సిరి సంపాదన‌ ఎంతో తెలుసా?

తెలుగు బుల్లితెర‌పై అతి పెద్ద రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్‌బాస్ నిన్న‌టితో ఐదు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఐదో సీజ‌న్ విన్న‌ర్‌గా వీజే స‌న్నీ నిలిచిన సంగ‌తి తెలిసిందే. అలాగే రెండో ర్యాంకు కోసం శ్రీరామ్‌, షణ్ను మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ.. చివ‌ర‌కు షణ్ను రన్నరప్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో 15 వారాలు ఉండటమే కాక టాప్‌ 5లో చోటు దక్కించుకున్న ఏకైక లేడీ కంటెస్టెంట్ సిరినే. తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫైన‌ల్స్‌కి చేరిన‌ సిరి.. ట్రోఫీ గెలుచుకోకుండానే ఎలిమినేట్ అయిపోయింది. ఆమెను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, హీరోయిన్ రష్మికలు ఘనంగా బయటకు తీసుకువచ్చారు.

అయితే పటాకా ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ గా పేరు తెచ్చుకున్న‌ సిరి.. ఈ షో ద్వారా ఎంత డ‌బ్బు సంపాదించింది అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న ప్ర‌చారం ప్ర‌కారం.. సిరి భారీగానే రెమ్యూన‌రేష‌న్ పుచ్చుకుంద‌ట‌. బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలు ఉన్నందుకు గానూ సిరి రూ.25 నుంచి 30 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోషకంగా తీసుకుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. నెట్టింట మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది.

Share post:

Latest