`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే అద్భుత విజయాలతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోలతో జోడీ కడుతూ వరుస సినిమాలు చేస్తున్న రష్మిక.. కొత్త ప్రయోగానికి సిద్ధమూంది.
ఒకవైపు హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి సత్తా చాటిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో రష్మిక సైతం చేరాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఆమె ఓకే చెప్పిందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ఇటీవల ఆయన చెప్పిన కథ రష్మికకు ఎంతగానో నచ్చిందట. దీంతో వెంటనే ఆమె ఓకే చెప్పిందని.. త్వరలోనే ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. అంతే కాదు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.
అయితే రాహుల్ రవీంద్రన్ చాలా కాలం నుంచి సరైన హిట్టే లేక సతమతమవుతున్నాడు. అటువండి వ్యక్తితో రష్మిక తన తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. మరి ఇందులో ఏదైనా బెడిసికొడితే ఇక అంతే సంగతులని అంటున్నారు సినీ లవర్స్. కాగా, ఇటీవల పుష్ప సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన రష్మిక.. శర్వానంద్‌తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది. ఇతర భాషల్లోనూ ఈమె పలు చిత్రాలు చేస్తోంది.