రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు నటించారు. వెస్ట్ బెంగాల్‌లోని కాళికా పూర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఫిల్మ్ మేకర్ కావాలనుకునే వాసుదేవ్ గంటాగా, బెంగాలీ లెంజండరీ రైటర్ శ్యామ్ సింగరాయ్‌గా నాని ద్విపాత్రభినయం చేసి అదరగొట్టాడు. ఇక టాక్ బాగుండటంతో ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను దాటుకుని బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్లను రాబడుతో బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది.
3వ రోజు ఏపీ, తెలంగాణలోనే 3.52 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్.. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో దాదాపు 17 కోట్లు షేర్ వసూలు చేసింది. శ్యామ్ సింగరాయ్ ఏరియాల వారీగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
నైజాం- 6.17 కోట్లు
సీడెడ్- 1.67 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.41 కోట్లు
ఈస్ట్- 0.60 కోట్లు
వెస్ట్- 0.50 కోట్లు
గుంటూరు- 0.78 కోట్లు
కృష్ణా- 0.56 కోట్లు
నెల్లూరు- 0.38 కోట్లు
—————————————————————————–
ఏపీ+తెలంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్- 12.07 కోట్లు (20.45 కోట్లు గ్రాస్)
—————————————————————————–
కర్ణాకట+రెస్ట్ ఆఫ్ ఇండియా- 2.31 కోట్లు
ఓవర్సీస్- 2.85 కోట్లు
టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 17.13 కోట్లు (30.35 కోట్లు గ్రాస్)
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల బిజినెస్ చేసిన శ్యామ్ సింగరాయ్ ..బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.22.5 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.17.13 కోట్లు వసూలు చేసేసిన ఈ చిత్రం.. ఇంకా రూ. 5.37 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే సేఫ్ అయినట్టే.