నాని హీరోగా సాయి పల్లవి ,కృతి శెట్టి హీరోయిన్లు గ నటించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ చిత్రం మొదటిరోజు నుండి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది.కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం కలెక్షన్స్ విషయం లో కొంచం సందిగ్ధం లో పడిందనే చెప్పుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదలైయినప్పటికీ అక్కడ కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది.
ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే..
నైజాం 7.55 cr
సీడెడ్ 1.95 cr
ఉత్తరాంధ్ర 1.67 cr
ఈస్ట్ 0.75 cr
వెస్ట్ 0.60 cr
గుంటూరు 0.91 cr
కృష్ణా 0.69 cr
నెల్లూరు 0.43 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.85 Cr
ఓవర్సీస్ 3.25 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 20.65 కేర్
తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం చాల చోట్లలలో నిర్మాతలే విడుదల చేసుకున్నారు.దానికి కారణం టికెట్ రేట్లు తాగించడమే అని తెలుస్తుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ రావాలంటే 30 కోట్ల షేర్ ని రాబట్టాలని ముందుగానే ట్రేడ్ పండితులు ఒక అంచనా వేశారు. ముందు ముందు తెలుగు రాష్ట్రాలలో సినిమా టిక్కెట్ల రేట్లు ఇలానే ఉంటే నిర్మాతల పరిస్థితే అయోమయం లో పడినట్లే అని చెప్పుకోవాలి.ఇక 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.20.65 కోట్ల షేర్ ను రాబట్టింది.