రష్మిక మందన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2018లో `ఛలో` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ సుందరి.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుని ఏకంగా నేషనల్ క్రష్‌గా మారిపోతుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హీందీ భాషల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటుంది.
ఇప్పటికే ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య 25 మిలయన్ల మార్క్ కూడా దాటేసింది. ఈ లెక్కన రష్మిక క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బ్యూటీ ఎదుగుదలను చూసి ఓర్వలేక.. తరచూ ఆమెను ట్రోల్ చేసేవారూ ఎక్కువగానే ఉన్నారు. తాజాగా కూడా ఓ నెటిజన్ రష్మికపై నీచమైన కామెంట్ చేశారు.
అది చూసిన రష్మిక.. సదరు నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ `సామీ సామీ పాట కోసం ఎంతో కష్టపడ్డాను.. అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు` అని చెప్పుకొచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా.. ఓ నెటిజన్ `అసలు దీన్ని హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సింది. ఇది.. దీని ఓవర్ యాక్టింగ్` అంటూ కామెంట్ చేశాడు.
ఇది చూసిన రష్మిక.. `యాక్టింగో.. ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను నువ్వు ఏం సాధించావు నాన్నా..` అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడీ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా, రష్మిక ప్రస్తుతం `పుష్ప` సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.