ప్రస్తుతం దేశంలోని సినీ ప్రేమికులు మొత్తం RRR సినిమా కోసం ఎదురు చుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు! ఎందుకంటే ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నది పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కాబట్టి. బాహుబలి సినిమాతో దేశ ప్రజలందరి మనస్సులో అంతటి గొప్ప స్థానాన్ని రాజమౌళి సంపాదించుకున్నారు. పైగా RRR సినిమాలో నటిస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్, రాంచరణ్. ఈ ముగ్గురి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ అభిమానుల్లో ఎంతో క్యూరియాసిటీ ఉండిపోయింది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుండటంతో దేశంలోని అన్ని సినీ ఇండిస్ట్రిస్ దానివైపే చూస్తున్నాయి.
ఇప్పుడు RRR టీం ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయినప్పటి నుండి అందరికి ఒక కొత్త విషయం తెలిసింది. అదేంటంటే RRR సినిమా ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య గొప్ప స్నేహబంధాన్ని చిగురింపచేసింది. సహజంగా ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలు వచ్చినప్పుడు ఒకరని ఒకరని పొగుడుకోవటం మామూలే కానీ ఎన్టీఆర్, రాంచరణ్ మాటలు చూస్తుంటే అలాలేవు ఒకరిపై ఒకరికి ఇంతగొప్ప అభిమానం,ప్రేమ ఉన్నాయో తెలుస్తుంది.ఎన్టీఆర్ చరణ్ గురించి మాట్లాడినా, చరణ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినా వాళ్ళమాటల్లోనే కాకుండా వారి కళ్ళల్లో కూడా ఆ ప్రేమ కనిపిస్తుంది.
మొన్నజరిగిన తమిళ్ ప్రమోషన్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ చరణ్ గురించి మాట్లాడుతూ RRR లో చరణ్ తో చేసిన ప్రతి సన్నీవేశం మళ్ళీ మళ్ళీ చేయాలనివుందని, చరణ్ ని ఎప్పుడూ నా ఎడమవైపు వుండాలనుకుంటా అని ఎందుకంటే గుండె ఎడమవైపే ఉంటుంది కాబట్టి అని చరణ్ కి తన మనసులో ఎంతటి స్థానం వుందో చెప్పాడు.
ఇక రాంచరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం కానీ పర్సనాలిటీ లో మాత్రం సింహం లాంటి వాడని, అంతటి మంచి బ్రదర్ ని ఇచ్చినదుకు రాజమౌళికి దేవుడికి థాంక్స్ చెపుతున్నా అని ఈ బంధం చనిపోయేవరకు ఉంటుందని చెప్పాడు.
ఇప్పుడు ఈ హీరోల ఇద్దరి మాటలు విన్న అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. నిజంగా ఇద్దరు పెద్దహీరోల మధ్య ఇంతమంచి స్నేహబంధం వుండటం అభిమానులమధ్య కూడా విభేదాలు లేకుండా చేస్తాయి.