`శ్యామ్ సింగరాయ్` పార్ట్ 2.. హీరో మాత్రం నాని కాద‌ట‌..!

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌లైంది.

ప్ర‌స్తుతం పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం నానికి భారీ హిట్ ఇచ్చేలానే క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ముఖ్యంగా త‌న‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని తెలిపిన రాహుల్‌.. శ్యామ్ సింగరాయ్ లాంటి సబ్జెక్ట్ ఆయ‌న‌తో చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని అన్నారు.

పవన్ అంటే ఓ ఫైర్ అని.. శ్యామ్ సింగ రాయ్ మాదిరిగానే ఎప్పుడూ ఫైర్ తో కనిపిస్తారని అభిప్రాయపడ్డారు. అయితే ఒక‌వేళ శ్యామ్ సింగ‌రాయ్ పార్ట్ 2 తీస్తే మాత్రం నానితో కాకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనే తీస్తాన‌ని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

కాగా, శ్యామ్ సింగ‌రాయ్ విష‌యానికి వ‌స్తే..1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఫిలిం డైరెక్టర్ వాసుగా, ప్ర‌జ‌ల కోసం పోరాటాలు చేసే శ్యామ్ సింగ‌రాయ్‌గానూ నాని క‌నిపించ‌నున్నారు. ఇక మిక్కీ జె. మేయర్ ఈ మూవీకి సంగీతం అందించారు.

Share post:

Latest