దిల్‌రాజు… ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు.. టాలీవుడ్లోనే బడా నిర్మాతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలను సైతం నిర్మిస్తున్న ఈయన.. తాజాగా సింగర్‌గా అవతారమెత్తారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల కరీంనగర్ లో `అమిగోస్ డ్రైవ్ ఇన్` రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే అక్కడ మ్యూజికల్ పెరఫార్మన్స్ ఇస్తున్న బ్యాండ్.. దిల్ రాజ్ ని స్టేజి పైకి ఆహ్వానించింది. తమతో కలిసి ఓ పాట పాడాల్సిందిగా కోరారు ఆ బ్యాండ్ సింగర్స్.
దీంతో కాస్త భయపడుతూనే మైక్ అందుకున్న దిల్ రాజు.. బ్యాండ్ సింగర్స్‌తో కలిసి నాగార్జున నటించిన `నిర్ణయం` సినిమాలోని `హలో గురూ ప్రేమ కోసమేరోయ్..` సాంగ్ అందుకున్నారు. మొదట్లో బెరుకుగా పాడినా ఆ తర్వాత మాత్రం దిల్ రాజు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆలపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు దిల్ రాజుకు ఈ ట్యాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. దిల్ రాజు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే ఎఫ్ 2, థ్యాంక్యూ మరియు తదితర చిత్రాలను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
#DilRaju Garu Singing at Karimnagar Drive Inn Opening ;) pic.twitter.com/pgpTFZpFij
— Milagro Movies (@MilagroMovies) December 12, 2021