ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ స్ట్రోంగ్ వార్నింగ్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడాయ‌న‌. అయితే ఇప్పుడు ఆ అభిమానులే హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించ‌డంతో.. ఎన్టీఆర్ వాళ్ల‌కు స్ట్రోంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

- Advertisement -

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం). డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్స్‌ నిర్వ‌హిస్తున్న చిత్ర‌యూనిట్‌.. ఆదివారం సాయంత్రం ముంబైలోని ఫిల్మ్‌సిటీలో ఓ భారీ ఈవెంట్‌ ప్లాన్‌ చేసింది.

ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ఎన్టీఆర్‌ అభిమానులు సైతం భారీగా తరలి వచ్చారు. ఈవెంట్‌ ప్రారంభం నుంచి హంగామా చేశారు. గట్టిగా అరుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్న అభిమానులు.. ఒకానొక స‌మ‌యంతో భారీకేడ్లు, ఇతర నిర్మాణాలపైకి ఎక్కి హ‌ద్దుమీర గోల చేస్తూ ఈవెంట్ కు అడ్డంకిగా మారారు.

ఇది గమనించిన ఎన్టీఆర్ వెంటనే.. తన అభిమానులను హెచ్చరించారు. `పద్ధతిగా లేదు.. కిందకి దిగండి. కిందకి దిగుతారా దిగరా. కిందకి దిగండి. కిందికి దిగి ఎంజాయ్ చేయండి. రాష్ట్రం దాటి రాష్ట్రం వ‌చ్చాం. మన గురించి అందరు బాగా మాట్లాడుకోవాలి. కిందకి దిగండి` అంటూ పదే పదే తనదైన స్టయిల్‌లో గాంభీర్య స్వరంతో ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఇక అప్పుడు అభిమానులు అదుపులోకి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Share post:

Popular