బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో నెక్స్ట్ గెస్ట్‌లు వీళ్లే..!!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో న‌వంబ‌ర్ 4న ఈ టాక్ షో ప్రారంభం అయింది. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా.. సెకెండ్ ఎపిసోడ్‌కి న్యాచురల్ స్టార్ నాని విచ్చేసి బాల‌య్యతో సంద‌డి చేశారు.

ప్ర‌స్తుతం ఆహా టీమ్ మూడో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ వారం గెస్ట్‌గా ఎవరు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గ‌త కొద్ది రోజుల నుంచీ కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం రానున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఆ ప్ర‌చారం నిజ‌మైంది. ముచ్చటగా మూడో ఎపిసోడ్ కు ఆహా టీమ్ బ్ర‌హ్మానందంను రంగంలోకి దింపారు.

అయితే బ్ర‌హ్మానందంతో పాటు మ‌రో గెస్ట్‌గా కూడా ఉన్నారండోయ్‌.. ఆయ‌న ఎవ‌రో కాదు వ‌రుస విజ‌యాల‌తో స్టార్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి. ఈ విష‌యాన్ని ఆహా వారు అధికారికంగా తెలుపుతూ మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమ్ అవుతుందా అని ఓటీటీ ప్రేక్ష‌కులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా, బాల‌య్య సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేశాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా..శ్రీ‌కాంత్ విల‌న్‌గా కనిపించ‌బోతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 2(రేపు)న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

 

Share post:

Latest