బాల‌య్య త‌న‌యుడి తొలి చిత్రంపై బిగ్ అప్డేట్‌..!?

న‌ట‌సింమం నంద‌మూరి బాల‌కృష్ణ ఏకైక త‌న‌యుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్ప‌టి నుంచో చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బాల‌య్య‌.. త‌న‌యుడి ఎంట్రీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య369’కు స్వీకెల్‌తోనే తన వారసుడిని పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు.

అంతేకాదు.. ఆ సినిమాలో తానూ నటిస్తానని చెప్పి డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ చిత్రానికి ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆదిత్య 369 చిత్రం 1991లో విడుద‌లై అనూహ్యమైన విజయాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే.

భూతకాలం భవిష్యత్తు కాలాన్ని ముడిపెట్టి టైమ్ మిషన్ ఆధారంగా అద్భుతమైన స్క్రిప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుండ‌గా.. అందులో బాల‌య్య‌తో పాటు మోక్ష‌జ్ఞ కూడా న‌టించ‌బోతున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సీక్వెల్ కి సంబంధించిన‌ స్క్రిప్ట్ పూర్తయిందట‌.

అప్పటి టైమ్ మిషన్ కు ఇప్పటి టెక్నాలజీని జోడించి స్టోరీని సిద్ధం చేశార‌ట‌. ఇక‌ ఈ సినిమాకీ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే ఆయన పర్యవేక్షణలో నడుస్తుందని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివారాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌ని తెలుస్తోంది.

 

Share post:

Latest