కరణ్ జోహార్ ని తెగ తిట్టేస్తున్న నెటిజన్స్.. ఏం చేశాడంటే..!

బాలీవుడ్ లో దర్శక నిర్మాతగా కరణ్ జోహార్ కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా ఆయనే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని థియేటర్లను మూసివేశారు.

ఢిల్లీలో కూడా ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అక్కడ సినిమా థియేటర్లు మూసివేశారు. దీంతో అక్కడ థియేటర్లను తెరిపించేందుకు కరణ్ జోహార్ రంగంలోకి దిగారు. ‘సినిమా థియేటర్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నారు. శానిటైజ్ చేస్తున్నారు. మామూలు ఇళ్లతో పోలిస్తే సోషల్ డిస్టెన్స్ తో పాటు ఇతర నిబంధనలు పాటిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తో పోలిస్తే థియేటర్లలో కోవిడ్ నిబంధనలు బాగా అమలు అవుతున్నాయి. ‘ అని కరణ్ జోహార్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీఎం కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ సినిమాలు సేఫ్ అనే హ్యాష్ ట్యాగ్ ని వినియోగించారు. అయితే ఇప్పుడు కరణ్ జోహార్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఇళ్లలో కన్నా థియేటర్లలోనే పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని కరణ్ జోహార్ అనడంపై నెటిజన్స్ మండిపడితున్నారు. అసలు కరణ్ జోహార్ కు బుర్ర పని చేస్తుందా లేదా..ఇళ్ల కంటే థియేటర్లు పరిశుభ్రంగా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉన్న వారు ఎవరైనా, దేని గురించే అయినా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని క్లాస్ పీకుతున్నారు.