జర్నలిస్ట్‌గా మార‌బోతున్న నాగ‌చైత‌న్య‌..కార‌ణం అదేన‌ట‌!?

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగ‌చైత‌న్య‌.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని భారీ ప్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్చుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న చైతు.. ఇప్పుడు జ‌ర్న‌లిస్ట్‌గా మార‌బోతున్నాడ‌ట‌. అయితే రియ‌ల్‌గా కాదులేండి.. రీల్‌గానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

నాగ‌చైత‌న్య తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేయడనికి ప‌చ్చ జెండా ఊపిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న ఈ సిరీస్‌కు విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. అయితే ఈ సిరీస్‌కి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

వాటి ప్ర‌కారం.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో చైతు జ‌ర్న‌లిస్ట్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. మూడు సీజన్ లుగా రాబోతున్న ఈ సిరీస్‌లో ఇర‌వై నుంచి ముప్పై ఎపిసోడ్లు ఉండ‌బోతున్నాయ‌ట‌. అలాగే ఇందులో చైతుకి జోడీగా ప్రియ భవాని శంకర్‌ న‌టించ‌బోతోంద‌ని టాక్‌. ఇక త్వరలోనే ఈ సీరీస్ కి సంబధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయిజ‌

కాగా, నాగ‌చైత‌న్య సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ల‌వ్ స్టోరీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న ఆయ‌న ప్ర‌స్తుతం విక్రమ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్యూ, క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో బంగార్రాజు చిత్రంలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.

Share post:

Latest