ఆర్ఆర్ఆర్: అదిరిపోయిన‌ `కొమ‌రం భీమ్` సాంగ్‌ ప్రోమో..మీరు చూశారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా, ఎన్టీఆక్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నారు.

- Advertisement -

అలాగే చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ లు న‌టించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో నిత్యం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్‌.

ఇందులో భాగంగానే తాజాగా ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి డిజైన్ చేసిన సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆయన తనయుడు కాలభైరవ ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సుద్దాల అశోక్ తేజ అందించారు.

ఇక `కొమురం భీముడో…కొమురం భీముడో…కొర్రాసు లెగడోలే, మండాలి కొడుకో… మండాలి కొడుకో… ఓ ఓ ఓ` అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో అదిరిపోయింద‌నే చెప్పాలి. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ఈ ప్రోమోపై ఓ లుక్కేసేయండి. కాగా, `కొమురం భీముడో..` ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

Share post:

Popular