ప్రముఖ సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా సాంకేతిక సమస్య వల్ల విమానం ల్యాండింగ్ కాలేదు. సమస్యను గుర్తించిన పైలెట్.. విమానాన్ని రేణిగుంట నుంచి బెంగళూరు విమానాశ్రయానికి తీసుకెళ్లి.. అక్కడ సేఫ్ గా ల్యాండ్ చేశారు.
రాజమహేంద్రవరం నుంచి రేణిగుంట కు బయలుదేరిన విమానంలో ఎమ్మెల్యే రోజా, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహా 70 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విమాన డోర్లు ఇంకా ఓపెన్ కాలేదు. ఇందుకు సంబంధించి రోజా ఒక వీడియో సెండ్ చేశారు. ‘ తాము ఇంకా విమానంలోనే ఉన్నామని.. డోర్స్ ఓపెన్ కావడం లేదని.. ఆమె ఆ వీడియోలో చెప్పారు. విమానం ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.