ఎన్టీఆర్ పేరిట న‌మోదైన అతి చెత్త రికార్డు ఏంటో తెలుసా?

నంద‌మూరి వంటి బ‌డా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌ను మార్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సినిమాల‌తో ఎన్నో అద్భుత‌మైన రికార్డుల‌ను నెల‌కొల్పిన ఎన్టీఆర్‌.. త‌న పేరిట ఓ చెత్త రికార్డును కూడా న‌మోదు చేసుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ కెరీర్ మొదలు పెట్టి ఇర‌వై అయిపోయింది. 2009 మిన‌హా ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉన్నాడు. కానీ, గ‌త మూడేళ్లుగా ఎన్టీఆర్ న‌టించిన ఒక్క చిత్ర‌మూ విడుద‌ల కాలేదు. 2018లో అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్ చివ‌రిగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఆ త‌ర్వాత‌ 2019, 2020 అలాగే 2021లోనూ ఆయ‌న నుంచి ఏ సినిమా రాలేదు.

దీంతో మూడేళ్ల పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోగా ఎన్టీఆర్ పేరిట అతి చెత్త రికార్డు న‌మోదు అయింది. ఇక‌పోతే ఎన్టీఆర్‌కి ఇంత లాగ్ గ్యాప్ రావ‌డానికి కార‌ణం రాజ‌మౌళినే. ఈయ‌న ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` కోస‌మే ఎన్టీఆర్ గ‌త మూడేళ్ల నుంచి క‌ష్ట‌ప‌డుతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్‌ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న మొత్తం 14 భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈ చిత్రం విడుద‌ల త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో ఓ చిత్రం, ప్ర‌శాంత్ నీల్‌తో ఓ చిత్రం చేయ‌నున్నాడు.