న‌టి హేమ శ్రీ‌దేవికి డూప్‌గా న‌టించిన చిత్ర‌మేదో తెలుసా?

న‌టి హేమ గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీలో హాస్య నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హేమ‌.. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన `భలేదొంగ` చిత్రం ద్వారా వెండితెరకు పరిచయ‌మైంది.

- Advertisement -

ఆ త‌ర్వాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో 500 పైగా చిత్రాల్లో న‌టించిన హేమ‌.. ప‌లు సీరియ‌ల్స్‌లోనూ న‌టించి మెప్పించింది. అలాగే హేమ ప‌లువురు హీరోల‌కు డూప్‌గానూ న‌టించింది. ఈమె డూప్‌గా చేసిన హీరోయిన్ల‌లో అల‌నాటి అందాల తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ఒక‌రు.

ఇంత‌కీ హేమ శ్రీ‌దేవికి డూప్‌గా న‌టించిన చిత్ర‌మేదో తెలుసా..? `జగదేకవీరుడు అతిలోకసుందరి`. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రమిది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ మూవీలో శ్రీ‌దేవి హీరోయిన్‌గా న‌టించింది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో శ్రీదేవి స్విమ్మింగ్ చేయాల్సి ఉంటుంది.

కానీ, శ్రీదేవికి ఈత రాదు. దీంతో ఆమె స్థానంలో ఈత వచ్చిన మరొక అమ్మాయి కోసం ఎదురు చూసినప్పుడు.. నటి హేమ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇక కె. రాఘవేంద్ర రావు మ‌రో ఆలోచ‌న లేకుండా శ్రీ‌దేవికి డూప్‌గా హేమ‌ను పెట్టి ఆ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌నే తెలియ‌దు.

Share post:

Popular