మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని తహతహలాడే హీరోయిన్లు ఎందరో ఉన్నారు. కానీ, ఓ హీరోయిన్ మాత్రం చిరుతో నటించి ఏకంగా సినీ కెరీర్‌నే నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మోహిని. ప్రస్తుత తరానికి ఈమె ఎవరో పెద్దగా తెలియక పోవచ్చు. కానీ, ఒకప్పుడు హీరోయిన్గా బాగానే వెలుగొందింది.
నందమూరి బాలకృష్ణ ఆల్ టైం క్లాసిక్ `ఆదిత్య 369`లో హీరోయిన్ నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహిని.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వివిధ భాషల్లో వందకు పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిందీమె. అయితే తెలిసో తెలియకనో మోహిని చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఆమె సినీ కెరీరే నాశనం అయింది.
అసలేం జరిగిందంటే.. చిరంజీవి హీరోగా నటించిన `హిట్లర్` సినిమాలో రాజేంద్రప్రసాద్ కూడా నటించడం జరిగింది. ఆయనకు భార్యగా చిరంజీవికి చెల్లెలిగా మోహిని నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు చిరంజీవిగారే స్వయంగా `నిన్ను చెల్లెలి పాత్ర ఎవరు చేయమన్నారు.. వద్దు..` అని మోహినికి చెప్పారట.
అయినప్పటికీ వినకుండా చిరంజీవికి చెల్లెలుగా నటించదట. ఇక స్టార్ హీరోకి చెల్లెలిగా నటించడంతో మోహినికి ఎక్కువగా హీరోయిన్ అవకాశాలు ఇవ్వలేదట దర్శకనిర్మాత. దాంతో ఆమె సినీ కెరీర్ క్రమక్రమంగా డల్ అయిపోతుంది. ఈ విషయాన్ని గతంలో మోహినినే ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.