షణ్ముఖ్‌తో దీప్తి బ్రేక‌ప్‌.. ఆ పోస్టుల వెనక అర్థం అదేనా?

యూట్యూబ్ స్టార్స్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, దీప్తి సునైన‌ల ప్రేమాయ‌ణం గురించి అంద‌రికీ తెలిసిందే. తాము ఐదేళ్ల నుంచీ ప్రేమ‌లో ఉన్నామ‌ని బహిరంగానే ప్ర‌క‌టించిన ష‌న్ను, దీప్తిలు.. ఒకరి పేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. అలాగే ష‌ణ్ముఖ్ బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పాల్గొన‌డంతో.. ప్రియుడిని గెలిపించేందుకు దీప్తి బ‌య‌ట ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది.

కానీ, విన్న‌ర్ అవ్వ‌లేక‌పోయిన ష‌ణ్ముఖ్‌.. ర‌న్న‌ర్‌గా నిలిచాడు. అదే స‌మ‌యంలో ఎంతో నెగెటివిటీని మూటగట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. అందుకు కార‌ణం సిరినే. స్నేహం పేరుతో హ‌ద్దులు మీరి ష‌ణ్ముఖ్‌, సిరిలు ప్ర‌వ‌ర్తించారు. వీళ్ల తీరు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కే కాదు.. వారి వారి కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా న‌చ్చ‌లేదు.

ఇక సిరి విష‌యంలో బాగా హ‌ట్టైన దీప్తి.. ష‌ణ్ముఖ్‌తో బ్రేకప్ చేసుకుందంటూ తాజాగా వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఇందుకు దీప్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్టులే కార‌ణం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో `కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు` అని రాసుకొచ్చింది. అక్క‌డితో ఆగ‌లేదు `నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా`, `ఈ సంవత్సరం నాకేమీ బాగనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను..` అంటూ వరుస పోస్టులు పెట్టింది.

ఈ పోస్టులు చూసిన నెటిజ‌న్లు షణ్ముఖ్ కు దీప్తి బ్రేక‌ప్ చెప్పిందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి నిజంగా షణ్ను-దీప్తిల రిలేషన్ చెడిందా..? లేక‌ దీప్తి పోస్ట్‌ల వెన‌క మ‌రేదైనా అర్థం ఉందా..? అన్న విష‌యాలు తెలియాలంటే వారిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు స్పందించాల్సిందే.

Share post:

Latest